Ragi : చెడు కొలెస్ట్రాల్ ను అడ్డుకుంటాయి రాగులు. గుండె సంబంధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి చాలా మేలు చేస్తాయి కూడా. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ ఉంటాయి. సో ఇవి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కాబట్టి మధుమేహులకు ఇవి వరం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారికి సరైన ఆహారం రాగులు. చర్మం ముడతలు పడకుండా చూసుకుంటాయి. ముఖానికి కాంతి వంతంగా ఉంచుతాయి. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేయడంలో సహాయం చేస్తాయి. అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తినడం వల్ల కావలసినంత క్యాల్షియం లభిస్తుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి.
రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. సో ఎముకలు బలంగా మారతాయి. రాగి జావను తాగితే శరీరానికి శక్తి వస్తుంది అంటున్నారు నిపుణులు. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇక విటమిన్ ఎ, బి, సిలతో పాటు, మినరల్స్ కూడా లభిస్తాయి. దీంతో జీర్ణశక్తి పెరుగి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల, వయస్సును తక్కువగా కనిపించేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగించాలి. ఇలా చేస్తే పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారిలో కండరాల నిర్మాణం మెరుగు అయ్యేలా చేస్తాయట.
వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి బలం, శక్తి అందుతుంది. రాగుల్లో పాలిఫినోల్స్ వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరచడానికి సహాయం చేస్తాయి. తద్వారా వృద్ధాప్య ప్రక్రియ తగ్గుతుంది. తద్వారా నిత్య యవ్వనంగా ఉండవచ్చు. అంతేకాదు ఇందులో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. సో ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ఆకలి ఉండదు కాబట్టి అనవసరమైన ఆహారం తీసుకోరు. తద్వార బరువును నియంత్రణలో ఉంటుంది.
రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం అవుతుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచవచ్చు. ఇక ఈ రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయస్సు పెరిగే వారికి రాగుల్లోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగి మాల్ట్ మంచి ఆహారం.