US presidential election : అగ్ర రాజ్యంలో ఆ ఇద్దరు ఎక్కడున్నారు ఇట్టే తెలుసుకోవచ్చు… సంచలన విషయం బయటపెట్టిన ఫ్రెంచ్‌ మీడియా!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో జరుగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో పోటీలో ఉన్న కీలక నేతల విషయాలు బయటకు వస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : October 29, 2024 2:30 pm

Location Fitness App

Follow us on

US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. గడువు తక్కువగా ఉండడంతో అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరూ వ్యక్తిగత విమర్శలూ చేసుకుంటున్నారు. మరోవైపు అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేసులో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విపక్ష నేత డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన సంచలన విషయాలను ఫ్రెంచ్‌ మీడియా బయట పెట్టింది. సాధారణంగా వీరికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా వారి లొకేషన్‌ విషయంలోనూ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఫ్రెంచ్‌ మీడియా ఈ నేతల లొకేషన్‌ ఫిట్‌నెస్‌యాప్‌ గురించి కథనం ప్రచురించింది. సెక్యూరిటీ ఉపయోగించే ఈ యాప్‌తో వారిని ఈజీగా ట్రాక్‌ చేయవచ్చని పేర్కొంది.

ప్రత్యేక యాప్‌..
సాధారణంగా రన్నట్లు, సైక్లిస్టులు బృందాలుగా వరౌట్‌ చేస్తుంటారు. వారు తమ యాక్టివిటీని రికార్డు చేసి షేర్‌ చేసుకుంటారు. అమెయికా నేతలకు భద్రత కల్పించే సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ సభ్యులు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భద్రతా సిబ్బంది ఈ స్రావా ఫిట్‌నెస్‌ యాప్‌ను ఉపయోగిస్తారని ఫ్రెంచ్‌ మీడియా తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా తెలిపింది. 2021లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ వారాంతంలో సముద్రతీరంలోని నార్మండీ రిసార్ట్‌లో సేదతీరారు. అది వ్యక్తిగత పర్యటన. ఆ ఫిట్‌నెస్‌ యాప్‌ వారుతున్న మెక్రాన్‌ బాడీగార్డులు పొందుపర్చిన వివరాల ఆధారంగా అధ్యక్షుడి లొకేషన్‌ను ట్రాక్‌ చేశారని తెలిపింది. ఇక అమెరికా ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్, మెలానియా ట్రంప్‌ ఎక్కడున్నార తెలుసుకునేందుకు బాడీగార్డుల స్ట్రావా ప్రొఫైల్‌ ట్రాక్‌ చేసి గుర్తించొచ్చని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2024లో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ చర్చల నిమిత్తం శాన్‌ప్రాన్సిస్‌కోలో బైడెన్‌ బస చేసిన హోటల్‌చిరునామాను కూడా ట్రాక్‌ చేసినట్లు తెలిసింది. బైడెన్‌ హోటల్‌కు చేరుకోవడానికి ముందు భద్రతా సిబ్బంది ఒకరు జాగింగ్‌ నిమిత్తం ఆ యాప్‌ను ఉపయోగించడంతో గుర్తించారు.

సిబ్బంది గుర్తింపు..
అధ్యక్షుల భద్రతకు బాధ్యత వహించే 26 మంది అమెరికన్లు, 12 మంద్రి ప్రాన్స్, ఆరుగురు రష్యా రక్షణ సిబ్బందిని గుర్తించారు. అయితే వారి పేర్లు మాత్రం ఫ్రెంచ్‌ మీడియా వెల్లడించలేదు. నాయకులు బస చేసే, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది ముందుగానే చేరుకుని తనిఖీలు చేస్తుంటారు. ఈ సందర్భంగా వారి కదలికలను ట్రాక్‌ చేయడం ద్వారా భద్రతాపరమైన ఉల్లంఘనలకు దారితీయవ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

స్పందించిన సీక్రెట్‌ సీర్వస్‌..
ఇదిలా ఉంటే ఫ్రెంచ్‌ మీడియా కథనంపై యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ స్పందించింది. విధుల్లో ఉన్న సమయంలో తమ సిబ్బంది వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ పరికరాలు వినియోగించడానికి అనుమతి లేదని తెలిపింది. కానీ ఆఫ్‌ డ్యూటీలో వాటిని వినియోగించకూడదన్న నిషేధం లేదని పేర్కొంది. ఈ విషయమై సిబ్బందికి అదనపు శిక్షణ, మార్గదరఖాల అవసరం ఉందా అని నిర్ధారించుకునేందుకు ఈ సమాఆచారాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే మెక్రాన్‌ కార్యాలయం ఈ కథనాన్ని పట్టించుకోలేదు.