
Money:సంపాదించి మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. దాని కోసమే అహర్నిశలు శ్రమిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. పూజలు, వ్రతాలు పాటిస్తుంటారు. డబ్బుల అవసరం మరీ పెరుగుతోంది. దీంతో అందరు డబ్బు కావాలనే చూస్తున్నారు. ఇంటి అవసరాలు తీరకపోతే అవసరమైతే అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ధనమేరా అన్నిటికి మూలం అని చెప్పక తప్పదు.
మన ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు ఎదురవుతుంటే చిన్నపాటి చిట్కాలు పాటించాలి. శుక్రవారం అమ్మవారికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత రాగి లేదా ఇత్తడి పల్లెం తీసుకోవాలి. ఈ ప్లేటు మీద కొత్త పసుపు గుడ్డ వేసి దానిపై 9 వక్కలు, పసుపు కొమ్ము, ఉంగరం లేదా వెండి లేదా బంగారం నాణెం వేసి కట్టాలి. ఆ మూటను మట్టి కూజా అడుగున ఉంచి దానిపై లడ్డు ఉప్పు వేయాలి. రాళ్ల ఉప్పును మట్టి కుండల్లో వాడితే వారం, రెండు వారాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.
పసుపు గుడ్డ అందుబాటులో లేని వారు తెల్లటి గుడ్డను పసుపు నీళ్లలో నానటెట్టి తరువాత ఆరబెట్టి చుట్టాలి. వెండి నాణేలు, బంగారు ఉంగరాలు లేని వారు కనీసం ఒక్క చిన్న బంగారమైనా పెట్టుకోవాలి. దీంతో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు లాభం పొందవచ్చు. ఇలా మన ఇంట్లోని కష్టాలు దూరం చేసుకునే క్రమంలో ఎన్నో చిట్కాలు తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు సంపాదన మీద ప్రధాన ధ్యాస పెడుతున్నాం. అయినా మన సమస్యలు తీరడం లేదు.
ఈ నేపథ్యంలోనే మన ఆర్థిక ఇబ్బందుల దూరం చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుండాలని పూజలు చేయడం కూడా సహజమే. ప్రతి రోజు దరిద్ర దేవతా పరిహారాలు పాటిస్తుంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ఎంతో ప్రయత్నిస్తుంటాం. కానీ అది అందరికి సాధ్యం కాదు. లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. వస్తే మాత్రం మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మనకు డబ్బుకు లోటుండని పరిస్థితి వస్తే లక్ష్మీదేవి కొలువున్నట్లు లెక్క.