
Vinaro Bhagyamu Vishnu Katha: ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన కిరణ్ అబ్బవరం తొలి సినిమా నుండి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ, ఒక హిట్ రెండు ఫ్లాప్స్ అన్నట్టుగా కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు.ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాల్లో ‘SR కల్యాణ మండపం’, ‘సమ్మతమే’ మంచి విజయాలు సాధించాయి.ఇప్పుడు ఆ జాబితాలోకి ఆయన లేటెస్ట్ చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ కూడా చేరిపోయింది.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని డీసెంట్ స్థాయి వసూళ్లను అయితే రాబడుతుంది కానీ,కిరణ్ అబ్బవరం ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమాగా మాత్రం నిలబడలేకపోయింది.ఈ సినిమా విడుదలై నేటికీ 13 రోజులు పూర్తి చేసుకుంది.ఈ 13 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం నాలుగు కోట్ల రూపాయలకే జరిగింది.మొదటి రోజే 30 శాతం కి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు నుండి కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయింది.కానీ ఇప్పుడు ఈ చిత్రం క్లోసింగ్ కి దగ్గర్లో ఉన్నట్టు సమాచారం.నిన్న ఈ సినిమాకి కేవలం 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, నేడు అందులో సగం అంటే రెండున్నర లక్షల షేర్ కూడా రాబట్టే అవకాశం లేదని తెలుస్తుంది.

అలా 13 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి బయ్యర్స్ కి కోటి 20 లక్షల రూపాయిల లాభాల్ని తెచ్చిపెట్టింది.గ్రాస్ పది కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.అలా కిరణ్ అబ్బవరం కెరీర్ లో సూపర్ హిట్ గా అయితే నిల్చింది కానీ, మరో స్థాయి హిట్ గా మాత్రం నిలబడలేకపోయింది.