Homeక్రీడలుSachin Tendulkar: మూడు రోజులు చాలు: టెస్ట్‌ మ్యాచ్‌లపై సచిన్‌ కీలక వ్యాఖ్యలు

Sachin Tendulkar: మూడు రోజులు చాలు: టెస్ట్‌ మ్యాచ్‌లపై సచిన్‌ కీలక వ్యాఖ్యలు

Sachin Tendulkar
Sachin Tendulkar

Sachin Tendulkar: వన్డేలు, టీ-20 లకు ఉండే క్రేజ్‌ టెస్ట్‌లకు ఉండదు. ఐదు రోజుల పాటు ఆట సాగుతుంది. దూకుడుగా లేని ఆట వల్ల ప్రేక్షకులు నిరసానికి గురవుతుంటారు. కొన్ని జట్లు ఆడే మ్యాచ్‌లకు అయితే ప్రేక్షకులు కూడా పెద్దగా హాజరు కారు. యాషెస్‌, గవాస్కర్‌, బోర్డర్‌ లాంటి సిరీస్‌లు తప్ప మిగతావేవీ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ విషయాన్ని ఐసీసీ కూడా గుర్తించింది. ఏం చేస్తే టెస్ట్‌ మ్యాచ్‌ ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో ఆలోచిస్తోంది. ఎంసీసీ కూడా ఇదే విషయంపై కసరత్తు చేస్తోంది. దీనిపై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పెద్దగా స్పందించికపోయినప్పటికీ.. మాస్టర్‌ బ్లాస్టర్‌ తన మనసులో మాటా చెప్పాడు. టెస్ట్‌ క్రికెట్‌ను ప్రేక్షకరంజకంగా మార్చాలంటే ఏం చేయాలో సోదాహరణంగా వివరించాడు.

‘టెస్ట్‌ మ్యాచ్‌ రోజుల తరబడి సాగుతుంది. అంత సేపు చూసే ఓపిక ప్రేక్షకులకు ఉండదు. ఇలాంటప్పుడు ఐసీసీ టెస్ట్‌ క్రికెట్‌లో సవరణలు చేస్తోంది. కానీ ఇప్పటికే ఇది ఆలస్యమైంది. ఎంసీసీ ఈ విషయంలో చూపిస్తున్న చొరవ బాగుంది.’ అని సచిన్‌ కితాబిచ్చాడు. ‘బౌలర్‌ కట్టుదిట్టమైన బంతులు వేసేలా మైదానాన్ని రూపొందించాలి. ఆ బంతుకుల బ్యాటర్‌ సమాధానం చెప్పాలి. అప్పుడే ఆట బాగుంటుంది.’ అని సచిన్‌ పేర్కొన్నాడు. మైదానం ఎలా ఉన్నా ఆట ఆకర్షణీయంగా ఉండాలని సచిన్‌ తన అభిప్రాయంగా చెబుతున్నాడు.

Sachin Tendulkar
Sachin Tendulkar

‘విదేశీ పర్యటలనకు వెళ్లే జట్లకు తమకు అనుకూలమైన మైదానాలు లభించవవు. అలాంటప్పుడు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా వారు సాధన చేయాల్సి ఉంటుంది. టెస్ట్‌ క్రికెట్‌ అత్యుత్తమంగా మారాలి అంటే బౌలర్ల అనుకూల పరిస్థితులు ఉండాలి. బౌలర్‌ విసిరే ప్రతి బంతికి బ్యాటర్‌ సమాధానం చెపాల్సిందే. ఆ సవాల్‌ లేకుంటే ఆట ఆకర్షణీయంగా ఎలా ఉంటుంది?’ అని సచిన్‌ చెబుతున్నాడు.

అయితే ఇటీవల గవాస్కర్‌, బోర్డర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడాయి. నాగ్‌పూర్‌, ఢిల్లీ, ఇండోర్‌, అహ్మదాబాద్‌ మైదానాల్లో మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆహ్మదాబాద్‌ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. పైగా బౌలర్లు వేసే కఠిన మైన బంతులకు బ్యాటర్లు సమాఽధానం చెప్పలేకపోయారు. ఇటు ఆసీస్‌, అటు భారత్‌ టెస్ట్‌ ర్యాక్సింగ్స్‌లో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ కనీసం మూడొందల స్కోరు కూడా సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిణామలను సచిన్‌ ఉటంకిస్తున్నాడు. మూడు రోజుల్లో మ్యాచ్‌లు ముగిసినంత మాత్రాన ఇబ్బంది లేదని, ఆట మాత్రం జనరంజకంగా సాగిందని సచిన్‌ చెబుతున్నాడు. మారుతున్న కాలానుగుణంగా టెస్ట్‌ క్రికెట్‌లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సచిన్‌ వివరిస్తున్నాడు. టెస్ట్‌ మూడు రోజులు నిర్వహించినా వచ్చే నష్టం లేదని వివరిస్తున్నాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version