Problems: సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే కొందరు తమకు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటారు. మరికొందరు మాత్రం అక్కడే ఆగిపోయి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఇంతటి సమస్యనైనా చిన్న ఓపికతో పరిష్కరించుకోవచ్చని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వీరు చెప్పేది చాలామంది పట్టించుకోరు. కానీ కొన్ని కథలను చూస్తే సమస్య అనేది ఎంత చిన్నదో అర్థమవుతుంది. అలాంటి కథ మీకోసం..
Also Read: స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఆ ఒక్కటి చేస్తే రాజమౌళిని బీట్ చేసేస్తాడా..?
ఒక జింక నీటి కోసం ఎడారిలో తిరుగుతూ ఉంటుంది. చివరికి ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంటుంది. అయితే ఇంతలో తనకు నీటి శబ్దం వినిపిస్తుంది. జింకకు సమీపంలో ఒక నది ప్రవహిస్తోంది. దీంతో నీటి చప్పుడు వినగానే గెంతులేసుకుంటూ జింక వెళ్ళింది. అయితే నది వద్దకు చేరుకోగానే ఒక వేటగాడు బాణంతో రెడీగా ఉన్నాడు. జింకపై వేయడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో పక్క నుంచి సింహం జింకను తినడానికి రెడీ అవుతోంది. అయితే వీరి బాధ నుంచి తట్టుకోవడానికి వెనుకకు వెళ్దామంటే అప్పటికే అడవి అగ్నితో ఆహుతి అవుతోంది. ఇలా సమస్యలు జింకను చుట్టుముట్టాయి.
అయితే జింక ఎలాగూ తన ప్రాణం పోతుంది.. కాస్త ఓపిక పట్టి నీరైనా తాగుతా.. అని నదిలోని నీటిని సేవిస్తుంది. అయితే అనుకోకుండా వర్షం పడి దహనానికి గురైన అడవి చల్లారిపోతుంది. ఇలా వర్షం పడుతున్న సమయంలో వేటగాడు జింక పైకి భాను వదిలాడు. కానీ అది తప్పిపోయి సింహానికి తాకింది. వెంటనే సింహానికి కోపం వచ్చి వేటగాని వైపుకు వెళ్ళింది. ఇలా ఒక్కసారిగా జింక చుట్టూ ఉన్న సమస్యలు తొలగిపోయాయి.
ఈ స్టోరీ తెలిపే నీతి ఏంటంటే.. ప్రతి మనిషికి ఏదో రకంగా ఇలా సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. సమస్యలు పరిష్కరించలేని సమయంలో కాస్త సహనం ఉంటే సరిపోతుంది. సహనం ఉండడం వల్ల సమయం అనుకూలంగా మారి సమస్యలు వాటికి అవే తొలగిపోతాయి. అందువల్ల ఎంతటి పెద్ద సమస్య వచ్చినా.. భయపడకుండా ఓర్పుతో ఉండాలి. నేటి కాలంలో చాలా మంది యువత చిన్న చిన్న సమస్యలకు హైరానా పడిపోతున్నారు. కొందరైతే ప్రాణమే తీసుకుంటున్నారు. ఇలాంటివారు జింకను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జింక తనకున్న పరిస్థితుల్లో ప్రశాంతంగా నీరును తాగాల్సిన అవసరం లేదు. కానీ సమస్యలను చూసి భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. సమస్యలు అలాగే తొలగిపోయాయి. అలాగే మనుషులు కూడా తమ పని తాము చేసుకుంటూ పోతే సమస్యలు వాటి అంతటావే తొలగిపోయి అవకాశముంది.