Husband – Wife : భార్యాభర్తలు కలిసి కలకాలం సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ప్రేమ, విశ్వాసం ఉండాలి. లేదంటే ఆ సంసారం సంతోషంగా సాగలేదు. అయితే కొన్నిసార్లు ఎలాంటి సమస్య లేకున్నా సరే మూడో వ్యక్తి కారణంగా గొడవలు వస్తుంటాయి. మరి ఆ మూడో వ్యక్తుల్లో అత్తమామలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొలీగ్స్ కూడా ఉంటారు. అదెలానో తెలుసుకోండి.
తల్లులకు పిల్లలంటే ఇష్టం కాబట్టి వారిని కంటికి రెప్ప మాదిరి కాపాడుకుంటారు. ప్రేమ వరకు బాగుంటుంది కానీ అతి ప్రేమ వల్ల కొడుకు, కూతురు విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. లేదంటే గొడవలు వచ్చే సమస్య ఉంటుంది. ఏ సమస్య అయినా ముందుగా భార్యభర్తలు మాట్లాడుకున్న తర్వాత సమస్యని సాల్వ్ చేసుకోవాలి.ముందుగానే మూడో వ్యక్తి దూరితే గొడవలు వచ్చే ఆస్కారం ఉంది.
కోడలైనా, అల్లుడికి అయినా సరే కొన్ని సార్లు అత్తలు చేసే విషయాలు నచ్చవు. వీరికి కూడా అల్లుడు/ కోడలు చేసే పనులు నచ్చవు. ఇలాంటప్పుడు అందరి మధ్య గొడవలు రావచ్చు. అందుకే కొన్ని విషయాలను మీ పార్టనర్‌తో ముందుగానే మాట్లాడి ఇతరుల సలహాలు తీసుకోవాలి. మరో విషయం ఏంటంటే ఎవరు వచ్చి ఏం చెప్పి, ఏం కలుగజేసుకున్నా మీరిద్దరు కూడా ఒకరికొకరు ప్రియారిటీ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు.
ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఇంట్లో కంటే ఆఫీస్‌లోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య సన్నిహిత్యం పెరగడం కామన్. కానీ, వీటి కారణంగా మీ వివాహ బంధంలో గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉందని గుర్తుంచుకోండి. ఎప్పుడు మీ కుటుంబానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం మర్చిపోవద్దు.
పిల్లలు పుట్టాక భార్యాభర్తల బాధ్యత మరింత పెరుగుతుంది. దీని వల్ల ఇద్దరికి సరైన సమయం దొరకదు. పిల్లల్ని ఎలా పెంచాలి. ఎలా చూసుకోవాలనే విషయాలపై గొడవలు వస్తుంటాయి. కానీ, దాంపత్య జీవితాన్ని కాదనుకుని పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మీ రిలేషన్ కు మంచిది కాదు. అంటే పిల్లల వల్ల మీ రిలేషన్ దెబ్బతినవద్దు. ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలి.
స్నేహితులు ఉండటం తప్పు కాదు. కానీ వీరి వల్ల మీ రిలేషన్ లో ఇబ్బంది రాకూడదు. భర్త కానీ, భార్య కానీ ఇబ్బందిగా ఫీల్ అవ్వొచ్చు. కాబట్టి, మీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ టైమ్‌ని మీ పార్టనర్‌తో స్పెండ్ చేయాలి. అలా అని ఫ్రెండ్స్‌ని పక్కనపెట్టడం కాకుండా .. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుండాలి.