Polavaram Project: పోలవరం.. ఏపీ ప్రజల అవసరాలు తీర్చే బహుళార్థక సాధక ప్రాజెక్టు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలోనే చంద్రబాబు పోలవరం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ ఐదేళ్ల కాలంలో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. నిత్యం సమీక్షలు, సందర్శనలు, సమావేశాలతో చంద్రబాబు పరుగులు పెట్టించారు. ప్రతి సోమవారం పోలవరం పై సమీక్ష ఉండేది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులు పడకేశాయి. రకరకాల కారణాలు చూపుతూ పనులకు బ్రేక్ పడుతూ వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి హయాం పోలవరానికి శాపంగా మారింది.
2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా.. ఆలోపే రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత భరించి మరీ పనుల్లో జాబితాన్ని తగ్గించగలిగారు. అత్యంత ఆధునిక పద్ధతుల్లోనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతూ వచ్చింది. ముందుగా డయాఫ్రం వాల్ ను నిర్మించారు. జర్మనీకి చెందిన బావర్ కంపెనీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే దిగువ, ఎగువ కాపర్ డ్యాం పనులు చకచకా సాగాయి. ఇంకోవైపు జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పనులు పరుగులు పెట్టించారు. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి అయిన దానిలో రాష్ట్ర అవసరాలకు పోను.. పురుగు రాష్ట్రాలకు విక్రయించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వాసిత కుటుంబాల్లో ఎక్కడ అసంతృప్తి తలెత్తకుండా పునరావాసం, పరిహారం విషయంలో పరిష్కార మార్గం చూపించగలరు. టిడిపి హయాంలో 73% పనులు పూర్తికాగా.. మిగతా వాటిని పూర్తి చేయడంలో జగన్ సర్కార్ విఫలం అయింది.
చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన కూడా తక్కువే. సమీక్షలు కూడా అంతంత మాత్రమే. 2020,21 లో కరోనాతో పనులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అయినా రాజకీయ కారణాలతో జగన్ నోరు మెదపలేదు. ముఖ్యంగా ప్రాజెక్టు ఎత్తును 41.75కు కుదించారు. ప్రాజెక్టు బియ్యాన్ని 55 వేల కోట్ల నుంచి 31 వేల కోట్లకు తగ్గించారు. 2022లో గోదావరి కి వచ్చిన వరదలు డయాఫ్రం వాళ్లను దెబ్బతీశాయి. కానీ జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. నిర్వాసితుల సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించలేకపోయారు.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరం పట్టాలెక్కే అవకాశం ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటన పోలవరం ప్రాజెక్టు సందర్శనే. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. కుంగిన గైడ్ బండ్ తో పాటు నిలిచిపోయిన అన్ని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు ప్రాజెక్టు అధికారులతో సమీక్షిస్తారు. సహాయక పునరావాస చర్యలు, భూ సేకరణ అంశాలపై సైతం చర్చిస్తారు. 2022 డిసెంబర్ ఒకటిన విపక్ష నేతగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. నేటి చంద్రబాబు పర్యటనతో.. సీఎం హోదాలో ఆయన 28వ సారి పోలవరం ప్రాజెక్టును సందర్శించినట్లు అవుతుంది.