Supermarket: ఒకప్పుడు గల్లీ గల్లీకి, వాడ వాడకు దుకాణాలు ఉండేవి. ప్రతి ఊరిలో దుకాణాలు ఉండేవి. లేదా కొందరు ఇంటి ముందుకు వచ్చి మరీ అమ్మేవారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సూపర్ మార్కెట్ల హవా నడుస్తోంది. ఈ మార్కెట్లు ప్రారంభం అయిన సమయంలో ఎక్కువ రేటు ఉంటుందని అనుకునేవారు. కానీ డిస్కౌంట్లతో అందరికీ అందుబాటులోకి వచ్చాయి సూపర్ మార్కెట్లు. ఇక వీటిని నడపడం చిన్న విషయం కాదు. చాలా తెలివితో నడపాలి. అయితే సూపర్ మార్కెట్ లలో ఎక్కడ చూసినా కూడా ఒకే విధంగా ఏర్పాటు చేసి ఉంటారు.
సూపర్ మార్కెట్ లో రోజువారీ సామాన్లు అయిన పప్పులు, బియ్యం వంటి సామాన్లను చివరి వరుసలో పెడతారు. కానీ వీటికి కారణం మీకు తెలుసా? ఈ చివరి వరుసలో ఉన్న సామాన్ల వరకు వెళ్లాలంటే మధ్యలో చాలా వస్తువులను దాటి వెళ్ళాలి. ఇక సూపర్ మార్కెట్ కు వెళ్లగానే చేతికి ఒక బుట్ట పట్టుకోవాలి. మనం కొన్న వస్తువులు అందులో వేయడానికి కాదు. ఒక వస్తువు వేస్తే ఖాళీగా ఉంటుంది కాబట్టి అదంతా నింపాలి అనిపిస్తుంది. ఈ కారణంగానే అంత పెద్ద బుట్ట ఇస్తారు. మూడవ వరుసలో బిస్కెట్లు, చాక్లెట్లు ఉంటాయి.
పిల్లలను తీసుకుని వెళ్తే పిల్లలు వాటిని అడుగుతారు. తీసుకోవడానికి సులభంగా ఉంటాయి. ఇక సూపర్ మార్కెట్ లో గడియారం ఉండదు. కస్టమర్ షాపింగ్ చేస్తున్నంత సేపు ఎంత సమయం అవుతుందో ఎంత సేపు గడిపామో తెలియదు. అందుకే వాచ్ పెట్టరు. చాలా సూపర్ మార్కెట్ లలో కిటికీలు ఉండవు. కిటికీ నుంచి చూస్తే బయట వాతావరణం కనిపిస్తుంది. వాతావరణాన్ని బట్టి సమయం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కిటికీలు ఉండవట. బిల్లింగ్ కౌంటర్ వద్ద మళ్లీ చాక్లెట్లు పెడుతారు. వెయిట్ చేస్తున్నప్పుడు చాక్లెట్లు కొనాలి అనిపిస్తుంది.
పిల్లలు ఉంటే వాటిని కచ్చితంగా అడుగుతారు. ఇక చిల్లర రిటన్ ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా చాక్లెట్స్ తీసుకుంటారు అని ఇలా పెడుతారు.అన్ని సూపర్ మార్కెట్ లలో ఇలా ఉంటుందా అంటే సాధారణంగా మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేస్తున్న సూపర్ మార్కెట్ లలో ఇలా ఉండే అవకాశాలు తక్కువే ఉంటాయి. గ్లాస్ డోర్స్ ఉంటాయి కాబట్టి సమయం ఎంత అనేది దాన్ని చూసి కనిపెడుతుంటారు. పైన ఫ్లోర్ లలో కానీ, మెయిన్ రోడ్ మీద కాకుండా కాలనీల్లో ఉన్న సూపర్ మార్కెట్ లో ఇలాంటి నియమాలు పాటిస్తుంటారు. కానీ జాగ్రత్తగా షాపింగ్ చేయండి.