Sleep : ఆఫీస్ లో చాలా నిద్ర వస్తుందా? వర్క్ చేస్తుంటే కండ్లు మూసుకొని పోతున్నాయా? జస్ట్ కాసేపు అలా వెళ్లి ఓ కునుకు తీసి వస్తే బాగుండు అనిపిస్తుందా? ఈ సమస్య ఒక్కరోజు మాత్రమే కాదా? నిత్యం వేధిస్తుందా. అజ్జో నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటున్నారా? కానీ మీకు ఒకరికి మాత్రమే కాదు మీలా చాలా మంది ఉన్నారు. అవును మీరు ఒంటరిగా లేరు. మీలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్య గురించి మరింత బ్రీఫ్ గా తెలుసుకుందాం.
ఆఫీసులో నిద్రపోవడం సామాజిక ఇబ్బందిని కలిగించడమే కాకుండా మీ ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారా? పగలు లేదా ఆఫీసులో నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు రాత్రిపూట 6-8 గంటలు నిద్రపోకపోతే లేదా మీ నిద్రకు పదే పదే అంతరాయం కలిగితే, మీరు పగటిపూట కూడా నిద్ర వస్తుంది. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
కొన్ని వైద్య పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు కూడా కారణం కావచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, హైపోథైరాయిడిజం వంటి సమస్యల వల్ల కూడా కొందరికి మధ్యాహ్నం సమయంలో ఎక్కువ నిద్ర వస్తుంది. ఇక ఈ వ్యాధులు మీ ప్రమాదాన్ని పెంచుతాయి. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు అటువంటి సమస్యల కారణంగా మీరు పగటిపూట నిద్రపోవడానికి ఇబ్బంది పడవచ్చు. నార్కోలెప్సీలో మన మెదడు నిద్ర-మేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధిక లేదా అకాల నిద్రతో బాధపడటానికి ఇదే కారణం.
అంతేకాదు వృద్ధులకు డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పగటిపూట అధిక నిద్రపోయే సమస్య కూడా ఉండవచ్చు. మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం కూడా దీనికి కారణం కావచ్చు. చక్కెర స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా మీకు మరింత నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన, పోషకమైన విషయాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ శక్తి స్థాయిని మంచి స్థితిలో ఉంచుతాయి.
నిద్రను దూరం చేయడానికి ఏం చేయాలి?
మీరు ఆఫీసులో తరచుగా నిద్రపోతే ఈ సమస్య నుంచి బయటపడటానికి మీరు కెఫిన్ ఉన్న వస్తువులను తక్కువ తీసుకోండి. కెఫిన్ ఒక ఉద్దీపన. అంటే ఇది మెదడు, నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను పెంచుతుంది. కాఫీ, టీలు నిద్రను దూరం చేస్తాయి. అంతే కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఎక్కువ నిద్ర వస్తుంది. కాసేపు అలా నడవడం మంచిది. మీ స్థలం నుంచి ఎప్పటికప్పుడు లేచి చుట్టూ తిరగడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.