Phone Side Effects: ఫోన్ అతిగా వాడే పురుషులందరికీ ఇది హెచ్చరిక

నేటి కాలంలో ఏ అవసరానికైనా ఫోన్ తప్పనిసరి అవుతుంది. చాలా మంది ఉదయం లేవగానే ముందుగా ఫోన్ ను చూస్తారు. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూసిన తరువాత నిద్రపోతారు.

Written By: Chai Muchhata, Updated On : November 4, 2023 10:10 am

Phone Side Effects

Follow us on

Phone Side Effects: జీవితాన్ని ఇప్పుడు టెక్నాలజీ నడిపిస్తోంది. ప్రతి పని సాంకేతికంతో కూడుకొని ఉండడంతో కొన్ని గాడ్జెట్స్ తప్పకుండా వాడాల్సి వస్తోంది. వీటిలో ముఖ్యంగా మొబైల్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ ద్వారా కొన్ని అవసరాలు తీర్చుకోవడమే కాకుండా కొందరు వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం లేచిందగ్గర్నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ చూడకుండా ఉండలేని పరిస్థితి. కొందరు అవసరాలకు మొబైల్ ను ఉపయోగిస్తే మరికొందరు మాత్రం కాలక్షేపం కోసం నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. అయితే ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఇదివరకే చదివాం. కానీ ఇప్పుడు పురుషుల్లో లైంగిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే?

నేటి కాలంలో ఏ అవసరానికైనా ఫోన్ తప్పనిసరి అవుతుంది. చాలా మంది ఉదయం లేవగానే ముందుగా ఫోన్ ను చూస్తారు. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూసిన తరువాత నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఎక్కువగా మానసిక సమస్యలు తీసుకొస్తుందని కొందరు వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. ఫోన్ ను తరుచుగా వాడేవారు ఈ సమస్యలను కచ్చితంగా ఎదుర్కొంటారని వైద్యులు ధ్రువీకరించారు.

తాజాగా కొందరు పరిశోధకులు తెలిపిన ప్రకారం.. నిత్యం ఫోన్ చూడడం వల్ల లైంగిక పటుత్వం కూడా కోల్పోతారని తెలిపారు. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ వాడేవారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందని ధ్రువీకరించారు.ఉదయం కంటే రాత్రి మొబైల్ చూడడం వల్ల బ్లూ లైట్ కళ్లపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్య శరీరంలోని నరాలపై కూడా పడుతుందని అన్నారు. ఈ సమస్య పెర్టిలిటీ , మేల్ స్పెర్మ్ పై ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు.

18 నుంచి 22 ఏళ్ల వయసులో ఉన్నవారిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో ఎక్కువ శాతం ఫోన్ వాడేవారిలో 21 శాతం స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నవారిలోనే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు మొబైల్ తోనూ ఈ సమస్యలు వస్తాయని హెచ్చిరస్తున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఫోన్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మగవాళ్లు రాత్రి సమయంలో ఎక్కువగా ఫోన్ చూడకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.