Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను సాధిస్తూ ఇండియా వైడ్ గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు, రేపటితో ఈ చిత్రం ప్రతిష్టాత్మక 1000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరనుంది. ఫుల్ రన్ లో వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ట్రెండ్ ఆ రేంజ్ లో కొనసాగుతుంది. సోమవారం రోజు ఈ చిత్రానికి దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉంది అనేది. ఇకపోతే ఈ సినిమాలో హీరో గా నటించిన అల్లు అర్జున్ తో పాటు ఇతర నటీనటులు కూడా ఒక రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ అన్నయ్య కూతురు గా నటించిన పావని కరణం గురించి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన మరో అమ్మాయి గురించి చర్చలు నడుస్తుంది. బ్యాంకాక్ ఎపిసోడ్ లో స్మగ్లింగ్ చేసే డీలర్ హమీద్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి పేరు ఆంచల్ ముంజల్. చాలా మంది ప్రేక్షకులు ఈమెని చూసి, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నందిని రాయ్ కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె నందిని రాయ్ కాదు, సరిగ్గా అలాంటి లుక్స్ తో ఉన్నాయి బాలీవుడ్ నటి. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఆంచల్, ఎన్నో హిందీ టీవీ సీరియల్స్ లో, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ వచ్చింది. ఈమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈమె 2008 వ సంవత్సరంలో ‘ధూమ్ మచవో ధూమ్’ అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2010 వ సంవత్సరం లో ‘వీ ఆర్ ఫ్యామిలీ’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాత్ర ఆమెకు మంచి పేరుని తెచ్చిపెటింది. అదే ఏడాది మొదలైన ‘పర్వారీస్’ అనే టీవీ సీరియల్ లో నటించి బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది. అలా ఆడియన్స్ దగ్గర అవుతూ వచ్చిన ఈమె సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమెకు మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘పుష్ప 2 ‘ చిత్రంలో ఈమెకు డైలాగ్స్ లేకపోయినా, కనిపించింది కాసేపే అయినా కూడా అటెన్షన్ ని భలే దక్కించుకుంది. మరి ఈమెకి భవిష్యత్తులో హీరో అయ్యేంత రేంజ్ ఉందా లేదా అనేది చూడాలి.