Before Married: పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు.. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒక్కటిగా మారి కలిసి చేసే ఈ ప్రయాణం ఎంతో సంతోషంగా ఉండాలని పెద్దలు కోరుకుంటూ ఉంటారు. అందుకే పెళ్లి కార్యక్రమానిక మంత్ర తంత్రాలతో.. బంధుమిత్రులను పిలిచి ఆడంబరంగా నిర్వహిస్తారు. అయితే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. కొన్ని రోజుల తరువాత ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగి.. శాశ్వతంగా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ముందే ప్రేమలో పడి.. ఆ తరువాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఎంతో మంచి విషయం. కానీ పెళ్లయిన తరువాత కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా.. కలిసే ఉండాలని పెద్దలు కోరుకుంటున్నారు. అయితే పెళ్లికి ముందు పెద్దలు చెప్పే విషయం ఏంటంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. కానీ ఈ కాలంలో వధూ వరుల గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. ఇంతకీ వారి గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటే?
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
పెళ్లి చేసుకునే ముందు చాలా మంది వరుడు ఎలాంటి వారు? ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు? ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కుటుంబ సబ్యులు ఎంత మంది ఉన్నారు? ముఖ్యండా ఆడబిడ్డలు ఎంత మంది ఉన్నారు? అనే విషయాలను బాగా పరిశీలిస్తారు. ఎందుకంటే తమ కూతురు పుట్టి నుంచి నుంచి మెట్టినింటి వరకు అందరినీ విడిచి వెళ్తుంది. ఇక్కడ అంతా కొత్తవారు. వారితో ఎలా ఉంటుందోనని భయపడి చాలా మంది ఈ విషయాలే పరిశీలిస్తారు. కానీ నేటి కాలంలో వీటి కంటే ముఖ్య విషయంపై కూడా తెలుసుకోవాలని అంటున్నారు.
పెళ్లి కుమారుడికి ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని కాకుండా… ఆ వరుడు ఆరోగ్యంగా ఉన్నాడా? అని తెలుసుకునే అవసరం వచ్చిందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మంది పెళ్లి అనగానే పైన చెప్పిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఆరోగ్యం గురించి ఎవరూ అడగరు. అలా అడిగితే ఎదుటివారిని అవమానించినట్లు అవుతుంది. అయితే ఈ అవమానం గురించి భయపడి వారి గురించి తెలుసుకోరు. కానీ పెళ్లయిన తరువాత వారికి అనుకోని దీర్ఘకాలిక జబ్బులు ఉంటే తీవ్ర నష్టం జరిగినట్లే.
ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ కామన్ అయిపోయింది. కొందరికి వంశపారం పర్యంగా వస్తే.. మరికొందరికి వారి అలవాట్లు, తినే ఆహారం వల్ల ఇవి సంక్రమిస్తున్నాయి. ఇవే కాకుండా చాలా మందికి బయటికి కనిపించకుండా క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది. కొన్నాళ్ల తరువాత ఇది బయటపడినా.. ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ముందే ఈ విషయాలను పసిగట్టాలని చెబుతున్నారు. అయితే ఈ విషయాలను నేరుగా వారిని అడిగి తెలుసుకోకుండా.. ఇతరుల ద్వారా అడిగి జాగ్రత్తపడాలని అంటున్నారు. గోవా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెళ్లికి ముందు హెచ్ఐవీ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోయినా పెళ్లి చేసుకునే ముందు వధూ, వరుల ఆరోగ్యాల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.