Andhra Pradesh Weather Alert: ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఈ అల్పపీడనం విస్తరించి ఉంది. ఇది తీరం మీదుగా కొనసాగుతోంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడడంతోనే ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Also Read: పులివెందుల ఫలితం.. జగన్ స్వయంకృతాపరాధం!
భారీ వర్షాలకు అవకాశం..
ఈరోజు అల్లూరి సీతారామరాజు( Alluri sitaramaraj ), అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో సైతం వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. నెల్లూరు,కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సైతం పిడుగులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైయస్సార్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో సైతం వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు అప్పుడే.. తేల్చేసిన సబ్ కమిటీ!
ఆ జిల్లాలపై ప్రభావం..
అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్రతో( North Andhra ) పాటు గోదావరి జిల్లాలపై కూడా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది. మరోవైపు వర్ష తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. వీలైనంతవరకు చెట్లు, పాడుబడిన భవనాలు కింద ఉండవద్దని సూచిస్తోంది. పిడుగులకు సంబంధించి ముందుగానే అప్రమత్తం చేస్తోంది. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సైతం సమీక్షించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.