https://oktelugu.com/

Parenting Tips: పిల్లల విషయంలో కచ్చితంగా పేరెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు..

చిన్నారుల నుంచి పరిపూర్ణతను కోరుకోవడం కూడా తప్పే అంటారు నిపుణులు. తమ పిల్లలు అన్నింట్లో ముందంజలో నిలవాలని కోరుకోవడం తప్పు లేదు కానీ ప్రతీ పరీక్షలో ఫస్ట్‌ రావాలి, ప్రతీ గేమ్‌లో మొదటి స్థానంలో నిలవాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 25, 2024 / 01:10 PM IST

    Parenting Tips

    Follow us on

    Parenting Tips: చిన్నారులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వారి భవిష్యత్తు అంత బాగుంటుంది. బిజీ బిజీ అంటూ తల్లిదండ్రులు డబ్బు సంపాదిస్తున్నారు కానీ పిల్లల గురించి పట్టించుకోవడం లేదు కొందరు. అయితే తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అంటున్నారు నిపుణులు. వారి మానసిక స్థితి మీద కూడా ప్రభావం పడుతుందట. మరి తల్లిదండ్రులు చేయకూడని ఆ తప్పులు ఏంటో ఓ సారి తెలుసుకోండి.

    చాలా మంది పేరెంట్స్ పిల్లలను ఇతరులతో పోలుస్తుంటారు. అయితే ఇది పిల్లల మనస్సుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు. ఇది చిన్నారుల ఆత్మన్యూనతా భావాన్ని దెబ్బతీస్తుందట. తాము ఓడిపోతున్నామని, ఇతరుల కంటే తాము వెనకబడి ఉన్నామనే భయపడుతుంటారు. ఇది చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.

    ఇక చిన్నారుల భావోద్వేగ అవసరాలను విస్మరించడం కూడా సరైనది కాదట.ఇలా చేయడం వల్ల కూడ వారిని మానసిక సమస్యలకు దారి తీసినట్టే అంటున్నారు నిపుణులు. కేవలం వారికి నచ్చిన వస్తువులను కొనిచ్చామని చేతులు దులుపుకున్నామన్నట్లు కాకుండా వారితో ఒక స్నేహితుడిలా మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాలి.

    ఇక చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్ చేయకూడదు. కొందరు పేరెంట్స్‌ తమ పిల్లలను దారిలోకి తీసుకురావడానికి ఎమోషనల్‌గా బ్లాక్‌మేల్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వారి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

    చిన్నారుల నుంచి పరిపూర్ణతను కోరుకోవడం కూడా తప్పే అంటారు నిపుణులు. తమ పిల్లలు అన్నింట్లో ముందంజలో నిలవాలని కోరుకోవడం తప్పు లేదు కానీ ప్రతీ పరీక్షలో ఫస్ట్‌ రావాలి, ప్రతీ గేమ్‌లో మొదటి స్థానంలో నిలవాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు. మీ కోరికలను వారి మీద రుద్దడం వల్ల చిన్నతనంలోనే ఇబ్బందిగా, బరువుగా ఫీల్ అవుతారు. అందుకే వారికి కాస్త స్వేచ్ఛను ఇవ్వాలి.

    పిల్లలను ఎక్కువ ప్రొటెక్ట్ కూడా చేయకూడదు. దీని వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్లలేరు, ఏ పని చేయలేరు. ఇది వారి జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాస్త వారిని ఫ్రీగా వదిలేసి మీకు భయం ఉంటే వెనక నుంచి అబ్సర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక కొందరు పిల్లలు చెప్పినట్టే వినాలి అనుకుంటారు. కానీ ఈ భావన ప్రతిసారి ఉంటే తిరగబడే అవకాశం కూడా ఉందని గుర్తు పెట్టుకోండి.