Vykunta Ekhadashi: హిందూశాస్త్రం ప్రకారం కొన్ని పండుగుల ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వీటిలో మకర సంక్రాంతి ఆగమనానికి ముందు వచ్చేది Vykunta Ekhadashi. వైకుంఠ ఏకాదశికి సనాతన ధర్మంలో ప్రత్యేక విశిష్టత ఉంది. ఈరోజు విష్ణువును పూజించడం వల్ల మోక్షం కలుగుతుందని అంటున్నారు. ఈరోజున విష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఉపవాసం ఉండడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజున కొందరు తెలియకు..మరికొందరు తెలిసి తప్పులు చేస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణువు కోపం తెప్పించినవాళ్లవుతారు. దీంతో జీవితంలో అన్నీ కష్టాలే ఎదురవుతాయి. మరి వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయకూడదో తెలుసా?
Telugu Panchangam ప్రకారం 2025 January 9న మధ్యాహ్నం 12.22 గంటలోకు వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం అవుతుంది. జనవరి 10న ఉదయం 10.19 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రత్యేక పూజలు, దైవారాధన బ్రహ్మ కాలం నుంచే ప్రారంభమవుతాయి. అందువల్ల జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. ప్రధాన ఆలయాలైన తిరుమల, యాదాద్రిల్లో భక్తులు ఎక్కువగారానున్నారు.
అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి? ఆరోజు ఏం చేయడం వల్ల మంచి జరుగుతుంది? ఈరోజున సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. పరిశుబ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో పూజ చేయాలని అనుకునేవారు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పీటం ఏర్పాటు చేసుకోవడానికి ఎంచుకున్న స్థలంలో ప్రత్యేకంగా పూలతో అలంకరణ చేయాలి. ఆ తరువాత చుట్టూ దీపాలతో అలంకరించాలి. ఇప్పుడు పీటం ఏర్పాటు చేసుకొని విష్ణువు చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత విష్ణువు విగ్రహం అయితే అభిషేకం నిర్వహించి ఆ తరువాత పూలతో అలంకరణ చేయాలి. లక్ష్మీదేవతతో పాటు విష్ణువును పూజించాలి. ఆ తరువాత నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత సమీప వైష్ణవాలయాన్ని సందర్శించాలి.
చాలా మంది ఓ వైపు విష్ణు పూజలు నిర్వహిస్తూనే మరోవైపు కొన్ని తప్పులు చేస్తుంటారు. విష్ణుపీఠం ఏర్పాటు చేసేవారు ఉపవాసంతో ఉండడం వల్ల శుభఫలితాలు ఉంటాయి. అయితే పండ్లు మాత్రమే తీసుకోవాలి. కొందరు టిఫిన్ల పేరిట బయట చిరుతిళ్లు తింటారు. వీటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మరికొందరు ఉదయం వైష్ణవాలయానికి వెళ్లి సాయంత్రం మద్యం సేవిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఆలయానికి వెళ్లిన ఫలితం దక్కదు. పొరపాటున కూడా అబద్దాలు ఆడకుండా ఉండడం వల్ల విష్ణువును సంతోష పెట్టినట్లు అవుతారు. సాయంత్రం సాత్విక ఆహారం తీసుకునే క్రమంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూడాలి. ప్రతికూల ఆలోచనలతో కాకుండా దైవనామస్మరణతో ఉండాలి.
వైకుంఠ ఏకాదశి రోజున పూజలు మాత్రమే కాకుండా కొన్ని దానాలు చేయడం మంచిది. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి కథలు వినడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ‘ఓం విష్ణువే నమ:’ అనే మంత్రాలను జపిస్తూ ఉండడం వల్ల శుభదిన ఫలితం ఉంటుంది.