https://oktelugu.com/

AP Pensions: పింఛన్ల తొలగింపు.. చంద్రబాబుకు పెద్ద దెబ్బ కానుందా?

రాష్ట్రవ్యాప్తంగా బోగస్ పింఛన్లు (fake pentions) ఉన్నాయని ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే ఇప్పుడు విచారణకు దిగుతోంది ప్రభుత్వం.

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 04:39 PM IST

    AP Pensions(1)

    Follow us on

    AP Pensions: కూటమి ప్రభుత్వం (AP Govt) సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనను మరింత వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాలు (welfare schemes) అమలు చేయాలని భావిస్తోంది. కొత్త రేషన్ కార్డులతో పాటు పింఛన్లు అందించాలని చూస్తోంది. అయితే అంతకంటే ముందే బోగస్ పింఛన్లు, రేషన్ కార్డుల పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఫేక్ పింఛన్లను తొలగించాలని చూస్తోంది. దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులకు ఇస్తున్న పింఛన్లను తనిఖీ చేసి.. అనర్హులు ఉంటే తొలగించాలని భావిస్తోంది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీకి సంబంధించి సర్వే ప్రారంభమైంది. ఈ తనిఖీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున పింఛన్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. గత ఐదేళ్లుగా అర్హత లేని చాలామంది పింఛన్లు పొందుతున్నట్లు నేరుగా ప్రభుత్వం కూడా గుర్తించింది. గత నెలలో ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాలను ఎంపిక చేసి తనిఖీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను తనిఖీ చేసేందుకు ఏకంగా బృందాలను నియమించింది.

    * తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో
    రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షలకు పైగా దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. అందులోనే పాక్షిక, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో (fake certificates) పింఛన్లు పొందుతున్నారన్నది కూటమి గుర్తించిన అంశం. అందుకే వారి ఆరోగ్య, వైకల్య స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది. పింఛన్లు తీసుకునే వారిలో ఆర్థోపెటిక్ హ్యాండీక్యాప్డ్, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం ఉన్న వారిని తనిఖీ చేయనున్నారు. వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. మిగతా లబ్ధిదారులను సైతం ఆసుపత్రులకు తీసుకెళ్లి తనిఖీ చేయనున్నారు.

    * ప్రత్యేక వైద్య నిపుణులతో
    ఈ వైద్య బృందంలో ఒక ఆర్థోపెడిషియన్ (orthopedician), జనరల్ ఫిజీషియన్ (genaral physician), పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తో పాటు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఈ కారణంతో పింఛన్ తీసుకుంటున్నారో.. ఆ విభాగానికి సంబంధించి తనిఖీ చేయనున్నారు. ఇలా తనిఖీ చేసే వారంతా పక్క జిల్లాలకు చెందిన వైద్యులే. తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పింఛన్ లబ్ధిదారుల నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న వారిని జాబితాల నుంచి తొలగిస్తారు. అయితే ఇప్పుడు అర్హులు కంటే అనర్హులే ఎక్కువగా దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కచ్చితంగా ఈ తొలగింపు ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతుంది. అయితే చంద్రబాబు (Chandrababu) మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోగస్ పింఛన్లు ఉండకూడదు అని.. కొత్త పింఛన్లు ఇవ్వాలంటే అనర్హుల ఏరివేత తప్పదని భావిస్తున్నట్లు సమాచారం.