UPI Without Internet: మనీ ట్రాన్స్ ఫర్ కోసం ప్రస్తుత కాలంలో మొబైల్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కూరగాయల మార్కెట్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ చేసేవాళ్లు మొబైల్ లోని Phone Pay, Google Pay ద్వారా డబ్బులను పంపించుకుంటున్నారు. అయితే మనీ యాప్స్ ఎక్కువగా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నందున్న సంబంధిత కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వినియోగదారుల డేటా భద్రతా ఉండేందుకు సెక్యూరిటీని చేర్చుతుంది. తాజాగా ఫోన్ పే లేదా గూగుల్ పే ల్లోని Unified Payment Interface (UPI)లో కొన్ని మార్పులు చేశారు. గతంలోనే యూపీఐ తరువాత UPI Lite అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత UPI 123 Pay ద్వారా కూడా పంపిణీ చేస్తున్నారు. అసలు యూపీఐ కి, యూపీఐ 123 పే కు మధ్య తేడా ఏంటి? యూపీఐ 123 పే ఎలా పనిచేస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ప్రతీ మొబైల్ లోని మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లో (UPI) ద్వారా మనీని సెండ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దీని ద్వారా కొంత లిమిట్ తో డబ్బులు పంపించుకోవచ్చు. అలాగే కిరాణా షాపుల్లో, షాపింగ్ మాల్ లో క్యూఆర్ కోడ్ కు మైబైల్ లో ఉండే స్కానర్ ద్వారా మనీని సెండ్ చేస్తారు. అయితే ఇలా మనీ ని సెండ్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఇంటర్నెట్ లేకుండా మనీ పంపడం సాధ్యం కాదు. కానీ ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కూడా మనీని సెండ్ చేసుకోవచ్చు.
UPI 123 Pay ద్వారా మనీని సెండ్ చేయడానికి ఎలాంటి ఇంటర్నెట్ సహాయం అవసరం లేదు. ఏదైనా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఇలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా Moneyని సెండ్ చేయాలంటే ముందుగా ఫోన్ లోని కీ ప్యాడ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు 08045163666 అనే నెంబర్ కు కాల్ చేయాలి. ఆ తరువాత ఇప్పుడు కంప్యూటర్ ఆప్షన్లు అడుగుతుంది. వెంటనే 1ని నొక్కాలి. ఆ తరువాత డబ్బులు ఎవరికి పంపాలని అనుకుంటున్నామో.. వారి నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత అమౌంట్ ఎంటర్ చేయమనే ఆప్షన్ అడుగుతుంది. ఇప్పుడు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు యూపీఐ పిన్ ను ఎంటర్ చేయాలి. ఇప్పుుడు కావాల్సిన వారికి మనీ వెళ్తుంది. పంపించిన వారి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
ఈ సదుపాయం కీ ప్యాడ్ ఫోన్ ఉన్న వాళ్లు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే మొబైల్ లో ఉన్న నెంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండాలి. ఇలా ఉంటేనే డబ్బులు పంపించుకోవడానికి వీలవుతుంది. అయితే ఇలా మనీ ని సెండ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి ఫోన్ నెంబర్ టైప్ చేసే సమయంలో తప్పితే ఇతర వాళ్లకు డబ్బులు వెళ్తాయి. అప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అందువల్ల అవగాహన ఉన్న వారు మాత్రమే యూపీఐ 123 పేను యూజ్ చేయాలి.