Andhra Pradesh
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh ) సమ్మర్ లో కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటువంటి వారికి రిలీఫ్ దక్కనుంది. మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. చాలా జిల్లాల్లో చిరుజల్లులు పడతాయని స్పష్టం. ఓ మూడు జిల్లాల్లో మాత్రం భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read : జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ.. అంతవరకు ఆగాల్సిందే : చంద్రబాబు
* ప్రధానంగా మూడు జిల్లాల్లో..
ప్రధానంగా పల్నాడు( Palnadu) , ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు చెట్ల కింద నిలబడ రాదని సూచించింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఆయా జిల్లాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను కూడా అప్రమత్తం చేసింది.
* కొనసాగుతున్న వడగాలులు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల( hot air) తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు, విజయనగరం జిల్లాలోని 16 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాలు, గోదావరి జిల్లాలో ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. కాకా గడచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా దొర్నిపాడు లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వైయస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 40.2, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* రానున్న మూడు నెలల్లో..
రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు( highest temperature) నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఏడాది వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. వడగల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ సైతం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని సూచించారు.
Also Read : అగ్గి మంటలో ఏపీ.. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!