https://oktelugu.com/

Sleeping : రాత్రి నిద్ర పోయే సమయంలో ఇలా చేస్తున్నారా? డేంజర్ లో పడ్డట్లే..

Sleeping : నేటి కాలంలో ప్రశాంతమైన నిద్ర పోయేవారు చాలా తక్కువ మందే ఉంటారు. రకరకాల ఒత్తిడి కారణంగా రాత్రి సమయంలో మానసిక ఆందోళనలతో ఉంటారు.

Written By: , Updated On : March 26, 2025 / 01:00 AM IST
Sleeping

Sleeping

Follow us on

Sleeping : నేటి కాలంలో ప్రశాంతమైన నిద్ర పోయేవారు చాలా తక్కువ మందే ఉంటారు. రకరకాల ఒత్తిడి కారణంగా రాత్రి సమయంలో మానసిక ఆందోళనలతో ఉంటారు. దీంతో అనువైన నిద్ర పోవడం లేదు. అయితే నిద్రపోయే సమయంలో ఆటంకాలు ఏర్పడితే మరింత ఆందోళన కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో దోమల బాధతో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. చిన్నపిల్లలు దోమల నుంచి తట్టుకోలేక పోతారు. ఈ క్రమంలో కొందరు దోమల భారీ నుంచి తట్టుకోవడానికి రసాయనాలు కలిగిన మిషిన్లు వాడుతూ ఉంటారు. వీటివల్ల దోమల నివారణ ఉంటుంది. కానీ దీని స్మెల్ చూడడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే చిన్న పిల్లలు నిద్రపోతున్న గదిలో ఇలాంటి రసాయనాలు కాకుండా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి సహజత్వం కలిగి ఉండాలి. అవేంటంటే?

Also Read : వామ్మో షాకింగ్ సర్వే.. స్లీపింగ్ డైవర్స్ వల్లే విడాకులు పెరుగుతున్నాయా? ఇందులో ఇండియానే మొదటి ప్లేస్ లో ఉందట..

చిన్నపిల్లలు నిద్రపోతున్న గదిలో రసాయనాలు కలిగిన మిషన్లు వాడడం వల్ల వారు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే దోమతెరలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దోమల నుంచి తట్టుకోవచ్చు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా దోమతెరలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇంట్లో వారందరూ దోమల నుంచి తట్టుకోవడానికి బెడ్ మంచం మొత్తం ఉపయోగించేలా దోమతెరలు అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఒక్కసారి కొనుగోలు చేస్తే ప్రతిసారి వాడుకోవచ్చు. అదే రసాయనాలు అయితే వాటి లిక్విడ్ అయిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

దోమల బాధ నుంచి తట్టుకోవడానికి రసాయనాలకు బదులు దోమల బ్యాట్లు అందుబాటులో ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లల గదిలోని దోమలను తరిమి కొట్టొచ్చు. అయితే వారి గదిలోని దోమలను బయటకు పంపడం లేదా వాటిని చంపివేసిన తర్వాత మళ్లీ గదిలోకి దోమలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమయంలో గది గుమ్మం వద్ద దోమతెరను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దోమల బ్యాట్ ను ఉపయోగించేవారు చార్జింగ్ ను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొందరికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ రసాయనాల కంటే ఇది బెటర్ అని కొందరు అంటున్నారు.

రాత్రి పడుకునే సమయంలో గదిలో ఎవరూ లేకుండా చూసి వేపాకులు కర్పూరం కలిపిన పొగను వేయాలి. దీంతో గదిలోని దోమలు బయటకు వెళ్లడం లేదా చనిపోతాయి. ఆ తర్వాత గదిని శుభ్రం చేసి నిద్రించవచ్చు. అయితే వేపాకు కర్పూరం కలిపిన పొగను పీర్చుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయినా పొగ పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే గదిలోకి వెళ్లాలి. లేకుంటే చిన్నపిల్లలు అవస్థలు పడతారు. నిమ్మకాయ కలిపిన నీటిని కూడా ఇంట్లో చల్లుకోవచ్చు. ఇలా చల్లడం ద్వారా వచ్చే వాసన ద్వారా దోమలు లేకుండా పోతాయి. నిమ్మకాయ కు సంబంధించిన వాసన పీల్చిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల దోమల నివారణకు రసాయనాలు కలిగిన మిషన్లు కాకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు.

Also Read : భాగస్వామితో కలిసి నిద్రిస్తే ఇన్ని ప్రయోజనాలా.. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..