Sleep Direction: పూర్వకాలంలో పెద్దలు కొన్ని నియమ నిబంధాలు పెట్టి వాటి ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు. అలా వెళ్లడం ద్వారా జీవితం బాగుంటుందని అలాగే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వాటిని పాటించిన వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు. అయితే కొందరు ఇవి మూఢనమ్మకాలు అని వాటిని కొట్టి పారేస్తున్నారు. అయితే ఆ కాలంలో పరిస్థితులను అర్థం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతోనే నియమాలను ఏర్పాటు చేశారు. ఇవి మూఢనమ్మకాలు అని అంటున్న సైన్స్ ప్రకారం కూడా ఇద్దరు చెప్పినవే నిజమని అంటున్నారు. ఇంతకు పెద్దలు చెప్పిన విషయం గురించి చర్చిద్దాం..
ప్రతి వ్యక్తికి కనీస నిద్ర అవసరం. అయితే ఈ నిద్ర సుఖంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. నియమాల ప్రకారం నిద్రపోవడం ఏంటి అని కొందరు కొట్టి పారేస్తారు. కానీ అలా చేయడం వల్ల హాయిగా నిద్రపోగలుగుతారు. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయే సమయంలో ఇలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నేటి కాలంలో మొబైల్ లేదా ఇతర వ్యసనాలను కలిగి సమయాన్ని వృధా చేసుకుంటూ నిద్రపోవడం లేదు. అయితే అలా కాకుండా అనుకున్న సమయానికి నిద్రపోవడం.. అలాగే సరైన మార్గంలో నిద్రపోవడం చేయాలని అంటారు.
అయితే పెద్దలు చెప్పిన ప్రకారం సరైన మార్గంలో నిద్రపోతేనే హాయిగా నిద్ర పడుతుందని అంటారు. అలాగే ఇలాంటి నిద్ర వల్ల ఎప్పటికైనా ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. సరైన మార్గంలో అంటే ఉత్తరం వైపు తల పెట్టుకోకపోవడమే. ప్రస్తుత కాలంలో దిశా దశ లేకుండా ఇష్టం వచ్చినట్లు నిద్రపోతూ ఉంటారు. కానీ ఉత్తరం వైపు తల ఉంచి నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆనాడు చెప్పారు.
అయితే పెద్దలు చెప్పిన దీనిని కొందరు మూఢనమ్మకాలు అని విస్మరిస్తున్నారు. కానీ సైన్స్ ప్రకారం కూడా ఇలా నిద్రపోవడం మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే భూమికి ఉత్తర వైపు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం మనుషుల మెదళ్ళపై పడుతుంది. అందువల్ల ఉత్తరం వైపు తల ఉంచడం వల్ల ఈ సమస్య వస్తుంది అని అంటున్నారు. అందువల్ల సాధ్యమైనంతవరకు ఉత్తర వైపు తల ఉంచకుండా నిద్రపోవాలని అంటున్నారు.
మరి ఏ దిశ వైపు నిద్రపోవాలి అని కొందరికి సందేహం అవుతుంది. దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల మంచిది అని అంటారు. నీ దిశలో తల ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అలాగే గాఢ నిద్ర పడుతుంది. ఎటువంటి కలత లేకుండా హాయిగా నిద్రపోవచ్చు.
అయితే పడమర వైపు తలపెట్టి నిద్ర పోవచ్చు కానీ హాయిగా నిద్ర పోలేరు. పీడ కలలు ఎక్కువగా వస్తుంటాయి. మనసు ప్రశాంతంగా ఉండదు. కానీ తూర్పు వైపు తలపెట్టి నిద్రపోవడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. అంతేకాకుండా జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.