Relationship : పెళ్లి అంటే నూరేళ్ళ పంట. మరి జీవితాంతం కలిసి ఉండే భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అంటే ఎన్నో విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత కష్టమైన నష్టమైన భరించాల్సి ఉంటుంది. అందుకే మీ భాగస్వామి విషయంలో ముందుగా కింద తెలిపిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోండి. అవేంటి అంటే..
అబద్ధాలు చెప్పకూడదు.. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నా, సాకులు చెప్పే అలవాటు ఉన్నా కూడా వీరి గురించి ఆలోచించాల్సిందే. తరచూ వాగ్దానాలు చేస్తూ వాటిని ఉల్లంఘిస్తుంటే వీరిని ముందుగా మందలించాలి. ఒకటి రెండు తప్పులను క్షమించవచ్చు కానీ తరచూ ఇలాంటివే చేస్తుంటే వీరితో జీవితం గడపడం చాలా కష్టమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారిని వదిలించుకోవడమే బెటర్ అంట.
స్వభావం నియంత్రించడం. ఇక్కడికి వెళ్లవద్దు, అక్కడికి వెళ్లవద్దు, వారిని కలవద్దు, వీరిని కలవద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటూ హద్దులు పెట్టేవారితో కష్టమే. ఇలాంటి వారితో ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. అంటే మీ స్వభావాన్ని నియంత్రిస్తుంటే మీరు ఆలోచించాల్సిందే.
ఎగతాళి, అవమానం.. స్నేహితులు, బంధువుల ముందు ఎగతాళి చేస్తుంటే జీవితం కోల్పోయినట్టు ఉంటుంది. అవమానిస్తే కూడా ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకంటే వీటిని వింటూ మీలో కూడా న్యూనతా భావం వచ్చేస్తుంది. దీనివల్ల మానసిక క్షోభకు గురవుతూ.. మానసిక ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి వారు భాగస్వామిగా ఉండకూడదు.
క్షమాపణలు చెప్పకపోవడం.. చిన్న తప్పులను క్షమించవచ్చు. కానీ పెద్ద తప్పులు చేస్తూ కూడా క్షమాపణ చెప్పని వ్యక్తితో చాలా కష్టం అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యక్తి భాగస్వామిగా ఉంటే జీవితాంతం రాజీ పడాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు.