Karimnagar Parliament Ticket : కాంగ్రెస్ లో కలకలం : నేతలు రాజేందర్ వైపు .. అధిష్టానం మది ఇటు వైపు

ఇక 3 ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు సపోర్టు చేసిన వ్యక్తిని కాదని ప్రవీణ్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సహా నేతలంతా గుస్సా అయినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తమ నిరసనను అధిష్టాన వర్గానికి తెలియజేసినట్టు సమాచారం. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది..

Written By: NARESH, Updated On : April 1, 2024 10:08 pm

Aligi Reddy Praveen Reddy and not Velichala Rajender Rao

Follow us on

Karimnagar Parliament Ticket : టాపాసులు రెడీ అయ్యాయి.. అంటుపెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా అగ్గిపెట్టెలతో రెడీగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి పొన్నం ప్రభాకర్ బలపరిచిన ‘వెలిచాల రాజేందర్ రావు’కే టికెట్ ఖాయం అని అంతా అనుకున్నారు. ప్రకటన ఆలస్యం ధూంధాం చేయడానికి కాచుకుకూర్చున్నారు. కానీ అందరూ ఆమోదించిన వెలిచాలను కాదని.. హుస్నాబాద్ లో ఓసారి ఓడిపోయిన.. ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన రెడ్డి సామాజికవర్గ నేత ‘అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి’ పేరు సడెన్ గా కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి రావడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోవడం లేదు. అసలేమైంది? ఎందుకిలా అభ్యర్థిని మార్చుతున్నారన్న అయోమయంలో నేతలంతా హతాషులవుతున్న పరిస్థితి నెలకొంది.

-కరీంనగర్ పార్లమెంట్ లో కలకలం
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారైందని.. ఇటీవల రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, ఉత్తమ్, శ్రీధర్ బాబులు హైదరాబాద్ లో భేటిలో ఫైనల్ చేశారని సమాచారం అందింది. దీంతోపాటు వెలిచాలకు ఈ విషయం చేరవేయడంతో ఆయన లాంచింగ్ కు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యకర్తలు, నేతలంతా సంబరంగా సంతోషపడుతున్నారు. అంతా హ్యాపీగా సాగుతున్న వేళ సడెన్ గా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతలంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందని.. గల్లీ నుంచి ఢిల్లీదాకా సంకేతాలు పంపించి.. ఆయన అభిమానులు సర్వం సిద్ధం చేసుకున్న ఈ సమయంలో చివరి నిమిషంలో ప్రవీణ్ రెడ్డి పేరు రావడంతో కార్యకర్తలు, నేతలంతా షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

-మంత్రి, 3 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా..
జిల్లా కీలక మంత్రి పొన్నం ప్రభాకర్, ముగ్గురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం, మిగతా నియోజకవర్గ ఇన్ చార్జీలు ముక్తకంఠంతో రాజేందర్ రావు అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చారు. ఆరు నియోజక వర్గాల ఇన్ చార్జీలు రాజేందర్ కి మద్దతుగా లేఖలు అధిష్టానానికి పంపించారు. మొదటి నుంచి కరీంనగర్ అంటే వెలిమల ఆధిపత్యమే నడుస్తోంది. ఇక్కడ అత్యధికంగా గెలిచింది వెలమ సామాజికవర్గ నేతలే.. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వెలిచాల రాజేందర్ రావుకే టికెట్ ఇవ్వాలని నేతలంతా ప్రతిపాదన చేశారు. దీనికి సానుకూలంగా అంతా ఓకే చెప్పి నిర్ణయం వెలువడుతున్న ఈ తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి రావడం కాంగ్రెస్ వర్గాలను అయోమయానికి గురిచేస్తోంది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజేందర్ రావుకే టికెట్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం.

-అధిష్టానంతో పంచాయితీ
ఇక 3 ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు సపోర్టు చేసిన వ్యక్తిని కాదని ప్రవీణ్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సహా నేతలంతా గుస్సా అయినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తమ నిరసనను అధిష్టాన వర్గానికి తెలియజేసినట్టు సమాచారం. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది..

*వెలిచాలను ఆపింది ఎవరు?
వెలమల కోటలో అందరూ సపోర్టు చేసిన వెలిచాల రాజేందర్ రావును కాదని.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎందుకు టికెట్ కేటాయిస్తున్నారు? ఒక నియోజకవర్గ నేతను పార్లమెంట్ బరిలో దింపడం బండి సంజయ్ ను గెలిపించడానికేనా? అన్న చర్చ కార్యకర్తలు, నేతలు, నియోజకవర్గంలో సాగుతోంది. వెలిచాలకే టికెట్ అని సీఎంవో నుంచి సైతం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ ఇప్పుడు అభ్యర్థిని మార్చింది ఎవరన్న ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులను తొలుస్తోంది.