Rice: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ప్రతిరోజు రైస్ వండుకుంటారు. కానీ మనలో చాలామందికి మాత్రం రైస్ ను వండేటప్పుడు ఎన్నిసార్లు కడగాలి, ఆ రైస్ ను ఎంతసేపు నాన పెట్టాలి అనే సంగతి తెలియదు. రోజువారి ఆహారంలో రైస్ చాలా ముఖ్యమైనది. ఏ రకమైన వంట చేయాలన్న దానికి రైస్ తప్పనిసరిగా ఉంటుంది. రైస్ వండే విషయంలో కొంతమంది మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. కానీ రైస్ వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. రైస్ వండే ముందు దానిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగడం చాలా అవసరం. ఆ బియ్యంలో రాళ్లు, ధూళి, పురుగులు ఏవైనా ఉంటే అవి వంటకు మంచివి కాదని నిపుణులు చెప్తున్నారు. రాళ్లు, ధూళి, పురుగులు వంటివి పోవాలంటే ఆ రైస్ ను రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా కడగాలి. దీనివలన మురికి కూడా పోతుంది. ఇటువంటి రైస్ తినడం వలన ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. రైస్ ను కొంచెం సేపు నానబెట్టి వండడం వలన మెత్తగా ఉడికేలా చేస్తుంది. జీర్ణ క్రియ కూడా సులభంగా జరిగేలా చేస్తుంది. ప్రతిరోజు వంట చేసేటప్పుడు రైస్ ను కొంచెం సేపు నానబెట్టి వండడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వంటకాల రుచిని కూడా ఇది మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అయితే సాధారణ రైస్ అయితే 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే 30 నిమిషాలు నానబెట్టాలి.
ఇలా చేయడం వలన వంట కూడా ఫాస్ట్ గా పూర్తి అవుతుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా రైస్ ను కొంచెం సేపు నానబెట్టి వండడం వలన దానిలో స్టార్చ్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది. ఈ విధంగా చేయడం వలన తేలికగా జీర్ణం అవుతుంది. ఈ విధంగా చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పైగా ఇది నిద్ర సరిగా పట్టడంలో కూడా చాలా సహాయపడుతుంది. రైస్ ను వండే ముందు ఒక గిన్నెలో తీసుకొని మూడుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ రైస్ మునిగేలాగా ఎక్కువ నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టాలి.
ఇక వంట చేసేముందు ఆ నీళ్లను పారేసి వేరే నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వలన వంట కూడా త్వరగా పూర్తి అవుతుంది. దీనివలన మీ గ్యాస్ లేదా కరెంటు రెండు కూడా ఆదా అవుతాయని తెలుస్తుంది. ఇలా చేయడం వలన శరీరానికి పోషకాలు పుష్కలంగా అంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ క్రియ కూడా చాలా సులభంగా జరుగుతుంది. నిద్ర సమస్యలు ఏవైనా ఉంటె కూడా ఈ విధం గా రైస్ వండడం వలన అవి తగ్గిపోతాయి అని నిపుణులు సూచిస్తున్నారు.