https://oktelugu.com/

Mohan Babu: మౌనిక, మనోజ్ ల నుండి నాకు ప్రాణహాని ఉంది.. కన్న కొడుకుపై కేసు పెట్టిన మోహన్ బాబు!

సెటిల్మెంట్స్ కూడా ఫెయిల్ అయిన నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ కేసుల వరకు వెళ్లారు. కొడుకు, కోడలి నుండి తనకు ప్రాణహాని ఉందని.. మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్ సైతం కేసు పెట్టాడు. మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న హైడ్రామా ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 10, 2024 / 01:11 PM IST

    Mohan Babu(1)

    Follow us on

    Mohan Babu: మోహన్ బాబుకి చిన్న కుమారుడు మనోజ్ తో విబేధాలు తలెత్తాయి. అందుకు ఆస్తుల పంపకాలే కారణం అనే వాదన ఉంది. తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న మనోజ్… తండ్రి మోహన్ బాబుపై ఒత్తిడి తెస్తున్నాడట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అది భౌతిక దాడుల వరకు వెళ్ళింది. మనోజ్ ని మోహన్ బాబు మనుషులు కొట్టారట. మనోజ్ గాయాలతో ఆసుపత్రికి రావడం మీడియాలో ప్రసారమైంది. మనోజ్ మాత్రం మీడియాతో మాట్లాడలేదు.

    డిసెంబర్ 10న జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న విష్ణు ఒక 40 మంది బౌన్సర్స్ ని అక్కడ ఏర్పాటు చేసాడు. అలాగే మనోజ్ కూడా 30 మంది బౌన్సర్స్ తో అక్కడకు వచ్చారు. విష్ణు హైదరాబాద్ వస్తున్నారని, మంచు విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య ఓ మీటింగ్ చోటు చేసుకోనుందని కథనాలు వెలువడ్డాయి. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి సైతం హైదరాబాద్ వచ్చారు. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద భారీ హైడ్రామా చోటు చేసుకుంది.

    కాగా సాయంత్రానికి మనోజ్, మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఫహడ్ షరీఫ్ సీఐ ని కలిసిన మనోజ్.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు, విష్ణు పేర్లను ఫిర్యాదులో మనోజ్ చేర్చలేదు. మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై ఆయన కంప్లైంట్ చేశారు. మరోవైపు మోహన్ బాబు నేరుగా కొడుకు, కోడలిపై ఫిర్యాదు చేశారు.

    మంచు మనోజ్, మౌనికల నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సీపీకి వాట్సప్ మెసేజ్ ద్వారా కంప్లైంట్ చేశాడట. కన్న కొడుకు నుండి తనకు ప్రమాదం పొంచి ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కాగా జుల్పల్లిలో గల గెస్ట్ హౌస్ కోసమే ఈ వివాదం అని తెలుస్తుంది. మోహన్ బాబు తన చివరి రోజుల ప్రశాంతంగా గడిపేందుకు జుల్పల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆ హౌస్ తనకు ఇవ్వాలని మనోజ్ అడుగుతున్నాడట. దాని ధర కోట్లలో ఉందట.