young people : జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రణాళిక వేసుకొని తమ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అయితే కొందరు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న సమయంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. ఏదైనా సాధించాలన్న తపన ఉంటుంది. కానీ ఇవి కాలేజీ రోజులు కాబట్టి స్నేహితులు పెరుగుతారు. కొన్ని అలవాట్లు బాగుంటాయి అనిపిస్తాయి. దీంతో జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. ఈ క్రమంలో కొందరు తమ జీవితాన్న చక్కదిద్దుకోవడానికి ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు భవిష్యత్ గురించి ఆలోచించి మంచి ప్రణాళిక వేస్తారు. ఇంకొందరు మాత్రం ఎలాంటి ప్లానింగ్ ఉండదు. అయితే ఈ సమయంలో వారు చేసే పొరపాట్లు ఏమిటంటే?
ప్రతీ మనిషికి యవ్వనం ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఇదే మంచి వయసు. కొత్తగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ వయసులోనే సాధ్యం అవుతుంది. జీవిత భాగస్వామిని ఎంచుకోవాలన్నా ఇదే అనువైన సమయం కానీ ఈ సమయాన్ని కొందరు వృథా చేసుకుంటారు. వీటిలో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. యవ్వనం ఒక్కసారి వెళితే తిరిగి రాదు. అందువల్ల భవిష్యత్ లో తాము చేయబోయే పని ఏంటో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ చేయాలన్నా యవ్వనంలోనే ప్రారంభిస్తే భవిష్యత్ లో అవసరమైన సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి.
యువకుల్లో ఎంత ఉత్సాహం ఉంటుందో అంతే కొంత మంది నిర్లక్ష్యంతో ఉంటారు. కొందరైతే ఇతర అలవాట్లకు బానిసలై ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఇలా వాయిదా వేయడం వల్ల వారు రానున్న రోజుల్లో మంచి జీవితాన్ని పొందలేదు. ఉదాహరణకు యవ్వనంలో ఉన్నప్పుడే ఏదైనా జాబ్ లో జాయిన్ కావడం లేదా వ్యాపారం ప్రారంభించడం కానీ చేయాలి. అలా మధ్య వయసు వచ్చేసరికి వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.కానీ కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో వారు రాను రాను మధ్య వయసు వచ్చే సరికి జాబ్ లో జాయిన్ అయినా అప్పుడు వచ్చే వేతనం సరిపోదు.
ఈమధ్య చాలా మంది యువకుల్లో కోపం ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు ఏ పనిని పూర్తి చేయలేరు. ప్రతి చిన్న విషయంలో కోపం తెచ్చుకొని సరైన విధంగా ఆలోచించలేరు. ప్రశాంతమైన మనసు ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. అయితే యువకుల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతు రానున్న రోజుల్లో తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ఎలాంటి కోపం అయినా కొన్ని చేయరాని పనులు చేస్తారు. దీంతో తీవ్రంగా నష్టపోతారు. ఈ కోపంలో చేసిన కొన్ని తప్పులు జీవితాంతం బాధపెడుతాయి.
నేటి కాలం యువతలో చాలా వరకు నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఇదిఇలాగే కొనసాగితే భవిష్యత్ లో సమస్యలు వస్తాయి. ఏ పని మొదలు పెట్టినా దాని పూర్తి చేసే వరకు వదలొద్దు. అటువంటప్పుడే జీవితంలో అనుకున్నది సాధిస్తారు.