https://oktelugu.com/

Mokshagna: పవన్ కళ్యాణ్ తో పాటు నందమూరి హీరోలు..మోక్షజ్ఞ మొదటి చిత్రం ముహూర్తం కి పోటెత్తనున్న సినీ సెలెబ్రిటీలు!

'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఆయన మొదటి సినిమా తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి తెరకెక్కబోతున్న ఈ సినిమా సూపర్ హీరో జానర్ లో ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే మూవీ టీం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 05:36 AM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna: కోట్లాది మంది అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన మోక్షజ్ఞ జాతకం రీత్యా ఎప్పుడు అడుగుపెడితే శుభం జరుగుతుందో అప్పుడే అడుగుపెట్టించేలా ప్లాన్ చేసుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియన్ సబ్జెక్టు తో వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఆయన మొదటి సినిమా తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి తెరకెక్కబోతున్న ఈ సినిమా సూపర్ హీరో జానర్ లో ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే మూవీ టీం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

    ఈ లుక్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. త్వరలోనే శుభ ముహూర్తం లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు తో పాటు నందమూరి హీరోలు మొత్తం హాజరు కాబోతున్నారు. నందమూరి హీరోలు మొత్తం అంటే జూనియర్ ఎన్టీఆర్ తో సహా. అంతే కాకుండా టాలీవుడ్ నుండి మరికొంతమంది ప్రముఖ స్టార్ హీరోలు కూడా ఈ ఈవెంట్ కి హాజరై మోక్షజ్ఞ ని ఆశీర్వదించబోతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కి వచ్చినప్పుడు మోక్షజ్ఞ పవన్ కళ్యాణ్ ని కలిసి అతనితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఇది ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ, ఈ షోకి వెళ్ళినవారు చెప్పిన మాట ఇది. మోక్షజ్ఞ కి పవన్ కళ్యాణ్ అంటే అంతటి ప్రత్యేకమైన అభిమానం ఉన్నందునే ముహూర్తం షూటింగ్ వచ్చేందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఈ సినిమాకి దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ అవ్వబోతుందని తెలుస్తుంది.

    ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల దాదాపుగా ఖారారు అయ్యినట్టే. మోక్షజ్ఞ మొదటి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకి రాగానే జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ వేస్తూ తాత గారి పేరుని నిలబెట్టాలి అంటూ శుభాకాంక్షలు తెలియచేసాడు. కళ్యాణ్ రామ్, నారా లోకేష్, నారా రోహిత్ వంటి వారు కూడా మోక్షజ్ఞ కి శుభాకాంక్షలు తెలియచేయగా, ఈ ట్వీట్స్ అన్నిటికి మోక్షజ్ఞ కృతఙ్ఞతలు తెలియచేసాడు. జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య బాబు కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే అపోహకు వీళ్ళ మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం బ్రేక్ వేసింది.