Pakistan Cricket : పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇదే సమయంలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ తన స్థానాన్ని మరింత దిగజార్చుకుంది. ఆ జట్టు కేవలం వెస్టిండీస్ కంటే మాత్రమే పై స్థానంలో ఉంది. పాకిస్తాన్ పై సాధించిన విజయం ద్వారా బంగ్లాదేశ్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన నాటి నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు ప్రస్తుత ఆటగాళ్ల ఆట తీరు పట్ల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వాసిమ్ అక్రమ్ కూడా చేరాడు.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం పట్ల అతడు విచారం వ్యక్తం చేశాడు..” గెలవాల్సిన మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ పరిణామాలను చూస్తుంటే బాధ కలుగుతుంది. మా దేశ క్రికెట్ జట్టులో పోరాడే తత్వం తగ్గిపోయింది. ఆటగాళ్లలో నైపుణ్యం కొరవడింది. జట్టుకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి అనుకుంటే చాలా మార్పులు చేయాలి. ఇది పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ గా.. మాజీ ఆటగాడిగా నాకు ఇబ్బందిగా ఉంది. అసలు ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? గెలవాల్సిన మ్యాచ్ లలో ఓడిపోవడం ఏంటి.. ఇంతటి భారీ ఎదురుదెబ్బలు ఏ జట్టుకూ ఎదురు కావు. సొంత గడ్డపై మా జట్టు ఆటగాళ్లు ఇలా విఫలం కావడం విచిత్రంగా అనిపిస్తోంది. ఇది మా దేశ ఆటగాళ్లలో ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని.. నాణ్యతను ప్రపంచానికి తెలియజేస్తుందని” అక్రమ్ అన్నాడు.
బంగ్లాదేశ్ పై ఓడిపోవడం కంటే ముందు నుంచే అంటే 2021 నుంచి పాకిస్తాన్ టెస్ట్ గెలుపును రుచి చూడటం మానేసింది. గత పది మ్యాచ్లలో పాకిస్తాన్ ఆరింట్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్ లను డ్రా గా ముగించుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి జట్ల చేతుల్లో సిరీస్ లు ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు తో తలపడిన టెస్ట్ సిరీస్ ను డ్రా గా ముగించింది. దారుణమైన ఆట తీరువల్ల గత ఆరు దశాబ్దాలలో టెస్ట్ ర్యాంకింగ్స్ లో అత్యంత దారుణమైన ర్యాంకును పాకిస్తాన్ అందుకుంది.. 1965 తర్వాత పాకిస్తాన్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.. వాస్తవానికి బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో.. బంగ్లాదేశ్ కేవలం 26 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలోఈ
లిటన్ దాస్ అద్భుత పోరాటం చేశాడు. దీంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. మొదటి టెస్ట్ లోనూ పాకిస్తాన్ ఆధిపత్యం ప్రార్థించింది. ఆ తర్వాత ఒక్కసారిగా లయను కోల్పోయి ఓటమిపాలైంది. బంగ్లా జట్టుతో టెస్టు సీరియస్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ ను మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. షాన్ మసూద్ స్థానంలో వేరే వ్యక్తికి టెస్ట్ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. వన్డే, టీ 20 లలో పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం ను పక్కనపెట్టి మరో వ్యక్తికి కెప్టెన్సీ బాధ్యతను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.