Chanakya Niti: చరిత్రలో ఎంతోమంది మేధావులు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆచార్య చాణిక్యుడు ఒకరు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను వివరించారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా స్త్రీల గురించి కూడా ఎన్నో విషయాలను వివరించారు. ముఖ్యంగా రెండు రకాల గుణాలు కలిగిన స్త్రీలను దూరం పెట్టాలని పేర్కొన్నారు. మరి ఆ గుణాలు ఏమిటి అనే విషయానికి వస్తే…
బద్ధకం కలిగిన స్త్రీ: ఒక వ్యక్తి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోక పోవడానికి ప్రధాన కారణం బద్ధకం అని చెప్పవచ్చు.ఇలాంటి బద్ధకం కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటే వారి సంసార జీవితం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పక్క వారిని కూడా బద్ధకస్తులుగా మారుస్తారని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు. ఇలాంటి బద్ధకం కలిగిన స్త్రీలు కుటుంబ విషయాలలో కూడా బద్ధకం చూపించడం వల్ల ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. అందుకే బద్ధకం కలిగిన స్త్రీలను కూడా దూరం పెట్టాలి.