Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సాయంత్రం కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని మహేష్ బాబునే స్వయంగా ట్వీటర్లో అభిమానులకు తెలియజేశాడు. దీంతో కోట్లాది మంది మహేష్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతూ ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే మహేష్ బాబు కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లోఅభిమానులు పూజలు, హోమాలు చేస్తూ కన్పించారు.

మహేష్ కరోనా జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటించి తమను అలరింపజేయాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే మహేష్ కు కరోనా సోకిందనే వార్త దవానంలా వ్యాపించడంతో ఆయన తోటి హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలంతా ట్వీటర్లో స్పందిస్తున్నారు. మహేష్ కు ధైర్యం చెబుతూ ఆయన త్వరగా కోలువాలనే ఆకాంక్షను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, తదితర హీరోలంతా మహేష్ త్వరగా కోలుకుంటారనే నమ్మకం వెలిబుచ్చుతూ ట్వీట్లు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆయన ఫ్యాన్స్ ఒకడుగు ముందుకేసి ఉదయం నుంచి దేవాలయాల్లో పూజలు చేయగా కొన్నిచోట్ల హోమాలు చేయడం కూడా కన్పించింది.

కోట్లాది మంది మహేష్ బాబు ఫ్యాన్ ఆయన త్వరగా కోలువాలని #MaheshBabu, #GetWellSoonSuperStar అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లాదాకా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమాన సంఘాల ఆధ్వర్వంలో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దేవుళ్ల పటాల వద్ద మహేష్ బాబు ఫొటోలను ఉంచి ప్రార్థనలు చేశారు.
మహేష్ బాబు కంటే ముందు ఇండస్ట్రీకి చెందిన రాంచరణ్, ఎన్టీఆర్, అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితర స్టార్స్ కరోనా బారినపడి త్వరగానే రికవరీ అయ్యారు. ఇదిలా ఉంటే వైద్యుల సూచనల మేరకు మహేష్ బాబు ప్రస్తుతం హోం ఐసోలేషన్లోకి వెళ్లి కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలువాలని మళ్లీ జెట్ స్పీడుతో సినిమాలు చేయాలని Oktelugu Team సైతం కోరుకుంటుంది. గెట్ వెల్ సూన్ మహేష్ బాబు వన్స్ ఎగైన్.