Top Ten Cars In India 2022: ప్రస్తుతం కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. కరోనా తర్వాత పబ్లిక్ వాహనాలకంటే జనాలు ప్రైవేటుగా తమ సొంత వాహనంలోనే వెళ్లాలన్న కోరిక పుట్టింది. అందుకే సెకండ్ హ్యాండ్ లోనైనా సరే ఓ చిన్న కారు తీసుకొని వెళుతున్నారు. తమ కలలు నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దాదాపు అన్ని కంపెనీలు కూడా తమ కార్ల ధరలు తగ్గిస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. పండుగ సీజన్ లో జోరుగా కార్ల అమ్మకాలు సాగుతున్నాయి. మరి గత నెలలో టాప్ 10 సేలింగ్ కార్లు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మారుతి ఆల్టో కారు మార్కెటింగ్ లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఎక్కువ కార్లు అమ్ముతూ తన మార్కెట్ ను విస్తరించుకుంటోంది. ఈ కారు అమ్మకాలు 21,260 యూనిట్లుగా నమోదు కావడంతో అమ్మకాల్లో 22 శాతం పెంచుకుని దూసుకుపోతోంది.

ఇక మారుతి సుజుకీ కంపెనీకే చెందిన వ్యాగనార్ కూడా అమ్మకాల్లో ముందుంటోంది. ఈ కార్లు 17,945 యూనిట్లుగా ఉండటంతో వార్షికంగా 45 శాతం పెరుగుదల చూపిస్తోంది. గత ఏడాది ఇదే నెలలో 12,335 యూనిట్లు విక్రయించి అన్ని కంపెనీలకు సవాలు విసురుతోంది. దీంతో వ్యాగనార్ కార్లు మార్కెట్లో ప్రజలను ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. అది అందించే మోడళ్లతో అందరూ దీన్నే కొనేందుకే మొగ్గుచూపుతున్నారు. కార్ల మార్కెట్ విస్తరణలో వ్యాగనార్ వేగంగా విస్తరిస్తోంది.

మారుతీ సుజుకి స్విఫ్ట్ కారు కూడా మార్కెట్ లో దుమ్ము రేపుతోంది. అక్టోబర్ నెలలో 17,231 యూనిట్లు విక్రయించి తనకు పోటీ లేదని నిరూపిస్తోంది. వార్షికంగా 88 శాతం పెరుగుదల నమోదు చేసి అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. సీఎన్జీ వేరియంట్ తీసుకురావడం ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు. మారుతీ బాలెనో కార్ల అమ్మకాలు కూడా విరివిగా సాగుతున్నాయి. 17,149 యూనిట్ల అమ్మకంతో ఇది కూడా ముందంజలో నిలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో ఈ మోడల్ అమ్మకాలు 15,573 యూనిట్లుగా నమోదు కావడం తెలిసిందే.

టాటా నెక్సన్ కారు అమ్మకాలు 13,567 యూనిట్లకు చేరుకున్నాయి. టాప్ 10 కార్లలో ఈ మోడల్ నిలవడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో 10,096 యూనిట్లు మార్కెటింగ్ చేసి అమ్మకాలు 36 శాతం పెంచుకుంది. మారుతీ సుజుకి డిజైర్ కారు అమ్మకాలు కూడా 53 శాతం పెరిగాయి. గత నెలలో 12,321 యూనిట్ల అమ్మకాలు జరిపి మంచి డిమాండ్ తెచ్చుకుంది. హ్యుందాయ్ క్రెటా కారు అమ్మకాలు కూడా పెరిగాయి. 11,880 యూనిట్లు విక్రయించి గత ఏడాదితో పోలిస్తే ఇదే నెలలో కారు అమ్మకాలు 84 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

టాటా పంచ్ అమ్మకాలు పెరిగాయి. ఇవి 10,982 యూనిట్లకు చేరుకోవడం సంచలనం కలిగిస్తోంది. మారుతీ సుజుకి ఎర్జిగా కారు అమ్మకాలు తగ్గాయి. 10,494 యూనిట్లు విక్రయించారు. ఈ కారు టాప్ 10 స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం