Manchu Vishnu: సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన మంచు ఫామిలీ కుటుంబం పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎంత నీచంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఊరు పేరు తెలియని హీరోల సినిమాలకు కూడా మొదటి రోజు మొదటి ఆట హౌస్ ఫుల్ అవుతున్న ఈరోజుల్లో మంచు హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి టికెట్స్ అమ్ముడుపోవడమే గగనం అయిపోయింది..దానికి ఉదాహరణలే సన్ ఆఫ్ ఇండియా మరియు జిన్నా చిత్రాలు.

రీసెంట్ గా మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..అమెరికా వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి కేవలం వంద టికెట్స్ కూడా అమ్ముడుపోలేదు..సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్స్ ని పెట్టుకుంటే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారేమో అనుకుకున్నాడు మన మంచు కుర్రాడు..కానీ మంచు విష్ణు తో కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసుకున్నా ‘జిన్నా’ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టేవాని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
ఆడియన్స్ మంచు కుటుంబం సినిమాలను చూడడం పూర్తిగా మానేశారు..ఈ విషయం అర్థం చేసుకొనే మంచు మోహన్ బాబు సినిమాల మీద ఆసక్తి తగ్గించేసాడు..మంచు మనోజ్ అయితే సినిమాలు చెయ్యడం ఎప్పుడో ఆపేసాడు..కానీ మంచు విష్ణు మాత్రం పట్టువదలని విక్రమార్కుడు లాగ హిట్టు కొట్టేవరకు సినిమాలు తీస్తూనే ఉంటాను అన్నట్లుగా దూసుకుపోతున్నాడు..తనని హీరో గా పెట్టి ఏ నిర్మాత కూడా సినిమాలు తియ్యడు కాబట్టి , తానే నిర్మాతగా మారి డబ్బులను ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసేస్తున్నాడు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ప్రముఖ డాన్స్ మాస్టర్ మరియు డైరెక్టర్ ప్రభుదేవా తో ఒక సినిమా చేయబోతున్నాడట..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగినట్టు తెలుస్తుంది.

తెలుగు , తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా, ఆ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు..ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేక్స్ అవ్వడం గమనార్హం..ఆయన రీసెంట్ సినిమాలు కూడా పెద్ద సక్సెస్ సాధించినవి లేవు..మరి ఈ ఇద్దరి కలిసి బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అనేది చూడాలి.