
Good Couple : భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలి. ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయం ఉండాలి. తన భార్య మీద ప్రేమ ఉండాలి. భర్త మీద ఆమెకు అనురాగం ఉండాలి. ఇలా ఉంటే వారి బంధం మూడు కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఆలుమగల అనుబంధం బలపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే అంతే సంగతి. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ముఖ్యమే.
సహనం
భర్త అయినా భార్య అయినా తమ భాగస్వామి చేసే తప్పులను క్షమించే గుణం ఉండాలి. సహనం ఉంటేనే ఇద్దరి మధ్య సఖ్యత సాధ్యం. దీంతో ఏదో ఒక సమయంలో చేసే పొరపాట్లను చూసీచూడనట్లు పోవడం అలవాటు చేసుకోవాలి. నిజంగా మీ భర్తకు మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇద్దరికి సహనం తప్పనిసరి.
పొరపాట్లు
భార్య చేసే పొరపాట్లను భర్త అర్థం చేసుకోవాలి. భార్య మందబుద్ధిని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. భార్య చేసే తప్పులను అర్థం చేసుకుని ఆమెను ఏమనకుండా ఉంటే ఆ భార్యపై భర్తకు ప్రేమ ఉందని తెలుస్తుంది. దీంతో భార్య మీద భర్తకు దయ ఉంటే ఇలా క్షమించడం పెద్ద విషయమేమీ కాదు. భార్య చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుతుండాలి.

ఎన్ని తప్పులు చేసినా..
భార్య ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఏమీ అనకుండా ఉంటున్నాడంటే అతడికి ఆమె మీద ప్రేమ ఉందని తెలుస్తుంది. భార్య చేసే పనుల్లో సహాయం చేస్తూ ఉంటే కూడా ఆమె పట్ల అతడికి ప్రేమ ఉందని అర్థం. ఈ నేపథ్యంలో భార్య కోసం తన పనులు పక్కనపెట్టి ఆమె పనులు చక్కబెడుతుంటే ఆమెకు సంతోషం కలుగుతుంది. ఇలా భార్యల మీద భర్తలకు ప్రేమ ఉందని తెలుసుకోవచ్చు.
భార్యాభర్తల విషయంలో భర్తకు భార్య మీద ప్రేమ ఉంటే ఎన్ని రకాలుగా తప్పులు చేసిన చూసిచూడనట్లు పోతే అతడికి ఆమె మీద ఎంతో ప్రేమ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భర్త భార్య చేసే పనులపై నిరంతరం పర్యవేక్షించి ఆమెకు నిత్యం సాయం చేస్తూనే ఉంటాడు. ఇలా ఇద్దరి మధ్య అనురాగం పెరగాలంటే ప్రేమ పెరగాలి. సఖ్యత ఉండాలి. అప్పుడే వారి మధ్య అనుబంధం పెరుగుతుంది.