
Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ కి ఆమె జంటగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. తమిళ చిత్రం వీరమ్ హిందీ రీమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ భాగం కావడం విశేషం. విక్టరీ వెంకటేష్ హీరోయిన్ అన్నయ్యగా కీలక రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఓ సాంగ్ లో తళుక్కున మెరవనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం పూజా ధరించి డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె వేసిన లూజు ప్యాంటు చూసి… సమ్మర్ కి గాలి ఆడటం లేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఫలితం ఏమవుతుందో అనే టెన్షన్ పూజా హెగ్డేను వెంటాడుతుంది. గత ఏడాది ఎదురైన అనుభవాల రీత్యా ఆమె భయపడుతున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఎలాగైనా విజయం సాధించాలని ఆశపడుతున్నారు. ఈ చిత్రం అటూ ఇటూ అయితే పూజా హెగ్డే ప్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసినట్లు అవుతుంది. 2022లో పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, ఎఫ్ 3, సర్కస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

సల్మాన్ మూవీతో ఆమె గ్రాండ్ కమ్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్డే మీద కొన్ని రూమర్స్ వచ్చాయి. పూజా-సల్మాన్ మధ్య ఎఫైర్ మొదలైందనే వార్తలు కాకరేపాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె పరోక్షంగా వీటిని ఖండించారు. నేను ప్రస్తుతం సింగిల్. ఎవరితోనూ రిలేషన్ లో లేనంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
ఓ స్టార్ డైరెక్టర్ తో పూజా ఎఫైర్ నడిపారని కూడా పుకార్లు ఉన్నాయి. ఇక సల్మాన్ మూవీ విడుదలకు సిద్ధం కాగా మహేష్-త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ చివరి కల్లా ఎస్ఎస్ఎంబి 28 చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుంది.
త్రివిక్రమ్ వరుసగా మూడో చిత్రానికి పూజాను తీసుకున్నారు. కాబట్టి పూజా-త్రివిక్రమ్ లకు ఇది హ్యాట్రిక్ మూవీ. వీరి కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో భారీ విజయాలు సాధించాయి. మహేష్ తో కూడా త్రివిక్రమ్ కి ఇది హ్యాట్రిక్ కావడం మరొక విశేషం. ఇటీవల విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.