Girl Parenting: సాధారణంగా ఒక అమ్మాయి పుట్టింది అంటే తల్లిదండ్రులు వారి కూతురి పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ముఖ్యంగా వారి పెంపకం విషయంలో పూర్తి స్వేచ్ఛను కూతుర్లకు ఇవ్వకూడదు, వారికి కావలసిన సదుపాయాలను అందిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
Also Read: Karthika Deepam: పనిలో చేరిన వంటలక్క, డాక్టర్ బాబు.. ఇకపై సంతోషాలేనా
అయితే మరి కొంతమంది అమ్మాయిలు మేము ఫలానా అబ్బాయిని ప్రేమించామని తల్లిదండ్రులకు చెబుతుంటారు. అయితే ప్రేమించే ముందు కూడా అమ్మాయి అబ్బాయి గురించి తెలుసుకోవాలి. అబ్బాయి అందంగా ఉన్నాడు కదా అని అమ్మాయిలు ఆకర్షితులు అయితే ఆ తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఒక అబ్బాయి నచ్చితే వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి పట్ల పూర్తి అవగాహన ఉన్న తరువాతనే మన ప్రేమను వ్యక్తపరచాలి.అలాగే అమ్మాయిల పెంపకం విషయంలో కూడా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిల విషయంలో కాస్త ఓపిక చేసుకుని వారి జీవితం గురించి ఆలోచిస్తే ఆ తర్వాత వారు ఎంతో సంతోషంగా ఉంటారు.
Also Read: Sankranti 2022: సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఇవే!