Mudra Loan : వ్యాపారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ముద్రలోన్‌ పరిమితి పెంపు… ఇక రూ.20 లక్షల వరకు రుణాలు!

కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్‌లో ముద్ర రుణాలు పెంచుతామని ప్రకటించింది. వ్యాపారుల ప్రయోజనాల కోసం ఈమేరకు ముద్ర లోన్‌ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 4:29 pm

Mudra Loan

Follow us on

Mudra Loan : వ్యాపారం కోసం పెట్టుబడి లేనివారికి చూయూత ఇవ్వాలన్న లక్ష్యంతో కేంద్రం ముద్ర పథకం ప్రారంభించింది. దీనిద్వారా రుణాలు అందిస్తోంది. ముద్ర రుణాలతో చాలా మంది వ్యాపారాలు విస్తరించుకుంటున్నారు. ఉపాధి పొందుతున్నారు. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముద్ర రుణాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు గుర్తించింది. దీంతో రుణాల పరిమితిని క్రమంగా పెంచుతూ వస్తోంది. మొదట ముద్ర రుణ పరిమితి రూ.5 లక్షలు ఉంది. తర్వాత దానిని రూ.10 లక్షలకు పెంచింది. తాజాగా రుణ పరిమితిని మరోమారు రెట్టింపు చేసింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రుణాలు చెల్లించిన వారికే..
ఇప్పటి వరకు తరుణ్‌ కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికే రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంచారు. అంటే ముద్ర లోన్‌ కింద రూ.20 లక్షల లోన్‌ తీసుకోవచ్చు. అంతేకాకుండా రూ.20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్‌ హామీ కవరేజ్‌.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ కింద అందించనున్నారు.

సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..
ప్రధాన మంత్రి ముద్ర యోజన అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష పరిశ్రమలకు రుణాలు అందిండం కోసం 20215లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ రుణాలు మెంబర్‌ లెండింగ్‌ ఇనిస్టిట్యూషన్లు అందిస్తారు. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్లు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ రుణం మంజూరు చేస్తాయి.

పెద్ద పరిశ్రమలకు పీఎంఏవై..
ఇక పెద్ద పరిశ్రమలు అయిన పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతోపాటు తయారీ వ్యాపారం వంటివాటికి పీఎంఏవై కింద రుణాలు అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ రుణాలు ఉపయోగపడుతున్నాయి.