Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. మన ఆరోగ్యం దెబ్బతింటే మనం ఏ పని చేయలేదు. ఫలితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. దీంంతో మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటే మనం ఏదైనా సాధించొచ్చు. ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా తినేయడంతో శరీరంలో వ్యర్థాలు పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే అవి మనకు రక్షణగా నిలుస్తాయి. ఫలితంగా ఆరోగ్యం బాగుంటుంది. ఇటీవల జరిపిన ఓ సర్వేలో ప్రతి వంద మందిలో 70 మంది అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంటే ఆరోగ్యవంతుల శాతం 30 అని తెలుస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు అయిన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

మనం ఆరోగ్యంగా ఉన్నామనడానికి ఆరు లక్షణాలు మనకు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది సుఖమైన నిద్ర. ఎవరైతే రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోతారో వారు ఆరోగ్యవంతులని తేల్చారు. ప్రతి రోజు చక్కని నిద్ర కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్రపోయే వారిలో ఏ రోగం లేనట్లే. ఒకవేళ సరిగా నిద్ర పట్టకపోతే ఏదో జబ్బు ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది. అందుకే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నామో చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది.
ఆరోగ్యవంతుల మరో లక్షణం. ప్రతి రోజు సాఫీగా మలవిసర్జన జరగాలి. లేచిన వెంటనే అయినా రోజులో ఎప్పుడైనా మలవిసర్జన జరగాలి. అది కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న వారిలో కాలకృత్యాలు తీర్చుకోవడం పెద్ద ఇబ్బంది ఉండదు. ఇలా జరిగితే ఆరోగ్యవంతులుగానే లెక్క వేసుకోవచ్చు. మలవిసర్జన జరగకపోతే పొట్టంతా ఉబ్బినట్లుగా ఉండి మనకు అనీజీగా అనిపిస్తుంది. దీంతో అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆరోగ్యవంతులకు ఈ సమస్య రాదు.
ఆకలి వేయడం కూడా మరో లక్షణం. మనం రోజు తినే సమయానికి ఆకలి వేయాలి. మనకు తినాలనే కోరిక కలగాలి. అప్పుడే మనం సంతోషంగా పదార్థాలను తీసుకోగలం. లేకపోతే మనకు ఆకలి వేయకున్నా తినాలని చూస్తే లోపలికి పోదు. దీంతో మనకు సమస్యలు చుట్టుముడతాయి. ఆకలి వేయడం కూడా ఆరోగ్యవంతుడి లక్షణమే. తిన్న ఆహారం అరిగితేనే ఆరోగ్యం ఉన్నట్లు. లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్లే. ఇంకా మన చాతీ చుట్టుకొలత మన నడుం చుట్టు కొలత కంటే ఎక్కువగా ఉండాలి. అంతేకానీ నడుం చుట్టు కొలత ఎక్కువగా ఉండి చాతీ చుట్టుకొలత తక్కువగా ఉంటే మనం ఆరోగ్యంగా లేనట్లే.

ఎప్పుడు సంతోషంగా ఉండటం కూడా ఆరోగ్యవంతుల అలవాటే. కొందరు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లు వెలితిగా ఉంటారు. అది అనారోగ్యాలకు మూలమే. అందరితో కలిసిపోయి సంతోషంగా ప్రవర్తిస్తేనే ఆరోగ్యవంతుల కింద లెక్క. ఇవన్నీ బేరీజు వేసుకుని చూస్తే మనం ఆరోగ్యవంతులమా? కాదా? అనే విషయం మనకే స్పష్టమవుతుంది. ప్రస్తుత కాలంలో ఆరోగ్యవంతులుగా ఉండటానికే ఇష్టపడాలి. అనారోగ్యాల బారిన పడితే అంతే సంగతి. భవిష్యత్ అంధకారంగా మారుతుంది.