
Maruti Suzuki Fronx: కారు అంటే ఇష్టమున్నవారు మార్కెట్లోకి కొత్త ఫీచర్స్ కలిగినవి ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తుంటారు. వారికి అనుగుణంగా మారుతి సుజుకి లేటేస్ట్ మోడల్ తో కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ ఫో 2023లో ఈ కంపెని సరికొత్త మోడల్ ను పరిచయం చేసింది. SUV నుంచి సరికొత్త డిజైన్ ను రూపొందించుకున్న ‘సుజుకి ఫ్రాంక్స్’ ఆటోమోబైల్ రంగంలో విప్లవాన్ని సృష్టించేందుకు తయారైంది. బాలెనో ఆధారంగా ఈ కొత్త క్రాస్ ఓవర్ ను పరిచయం చేసి ‘బాలెనో క్రాస్’ అని పిలుస్తున్నారు. అయితే దీనికి ఫైనల్ గా మాత్రం ‘ఫ్రాంక్స్’ అనే పేరును డిసైడ్ చేశారు. మరి ఈ కారు ఫీచర్ల సంగతేంటో తెలుసుకుందామా..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ అధునాతన ఫీచర్స్, డిజైన్, ఇంజన్ ఫర్ఫమెన్స్ ఆకట్టుకునే ఉంటుందని యాజమాన్యం తెలుపుతోంది. కారు ముందు భాగంలో గ్రాండ్ విటారా మోడల్ వలె ఉంటుందని చెప్పొచ్చు. క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ స్పిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ తో నిలువుగా ఉన్న ఫ్రంట్ ఎండ్ ను ఉంటుంది. ట్రిపుల్ ఎల్ఈడీ డీఆర్ఎస్ లు క్రోమ్ స్ట్రీప్స్ ద్వారా గ్రిల్ ఎగువ భాగంలో బ్యాడ్జ్ కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ క్రోమ్ స్ట్రీవ్ లు సుజుకి బ్యాడ్జ్ లో చేరినప్పుడు అందంగా కనిపించే విధంగా డీఆర్ఎల్ పరిమాణాన్ని చూపిస్తాయి. హెడ్ ల్యాంపులు ముందు బంపర్ వైపులా ఎన్ క్లోజర్ లో కనిపిస్తాయి.
ఫ్రాంక్స్ వెనుక భాగం పరిశీలించినప్పుడు 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, చురుకైన విండ్ స్క్రీన్, ఎల్ ఈడీ లైట్స్ ఉన్నాయి. దీని వెనుక ఉన్నవారెవరైనా ఇది ఫ్రాంక్స్ అని గుర్తుపట్టేవిధంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకవేళ కారు డోర్లు తెరిచి లోపలికి వెళ్లాలనుకున్నప్పుడు కొత్త కారులోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. క్యాబిన్ ను చూస్తే బాలెనో నుంచి చేరుగా తయారు చేసినట్లు అనిపిస్తుంది. అయితే కార్ల కొనుగోలులో అనుభవమున్నవారు మాత్రం ఈ ఫీచర్ ను కామన్ గానే స్వీకరిస్తారు.
డాష్ బోర్డు ప్లాస్టిక్ లాగే ఉండడంతో పాటు సాఫ్ట్ టచ్ మెటిరీయల్స్ ఇందులో ఎక్కడా కనిపించవు. దీంతో స్మూత్ గా డ్రైవ్ చేసేవారికి కాస్త అసౌకర్యం కలగవచ్చు. అయితే మారుతి వెనక భాగంలో ఉన్న ఆర్మ్ రెస్ట్ ను కలిగించే సీట్లు మాత్రం సౌకర్యవంతంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే తో పాటు 9 ఇంచుల ఇన్ఫెటైన్మెంట్ స్క్రీన్ లేయర్డ్ డాష్ ప్లే హోస్ట్ తో పాటు డ్యూయల్ టోన్ థీమ్ ఇందులో కలిగి ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 37 లీటర్ పెట్రోల్ ట్యాంక్ 308 లీటర్ బూట్ అందిస్తోంది. 1.2 లీటర్ ఇంజన్ తో కూడిన వెర్షన్ కోసం 965 నుంచి 975 కిలోల బరువును కలిగి ఉంటుంది. బూస్టర్ జెట్ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కొత్త ఫ్రాంక్ష్ ని కలిగి ఉంది. ఇందులో 40 ప్లస్ కనెక్ట్ చేయబడిన కనెక్ట్ సూట్, డిస్ ప్లే తో పాటు స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. 360 డిగ్రీ కెమెరాతో అవుట్ పుత్ సెంట్రల్ డిస్ ప్లే ద్వారా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. మూడు సిలిండర్ల బూస్టర్ ఇంజిన్ తో పాటు 98.7 బీహెచ్ పీ వద్ద 5,500 ఆర్పీఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సరికొత్త ఫీచర్లు కలిగిన దీనిని రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.