
MG Comet EV: సాధారణంగా కారుకు నాలుగు డోర్లు కలిగి ఉంటాయి. కానీ రెండు డోర్లతో సరికొత్త డిజైన్ ను కలిగిన కారు భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. మార్కెట్లోకి కొత్త కారు కోసం ఎదురుచూసేవారికి ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్ట్రాంగ్ బ్యాటరీ రేంజ్, 50 kW శక్తితో కూడిన దీనిని ఏప్రిల్ 19న అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంతకుముందే దీని గురించి ఆన్లైన్లో వివరాలు పెట్టడంతో దానిని సొంతం చేసుకునేందుకు చాలా మంది కారు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ కారు ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.
ఎంజీ మోటార్స్ ఇప్పటి కే జెడ్ఎస్ పేరుతో ఎలక్ట్రికల్ కారును పరిచయం చేసింది. ఇప్పుడు సరికొత్త మోడల్ లో మరో కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ అతిచిన్న కారు కేవలం రెండు డోర్లను మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఇందులో నలుగురు వ్యక్తుల కంపర్టోబెల్ గా కూర్చోవచ్చు. దీనికి యాజమాన్యం ‘కామెట్’ అని నామకరణం చేసింది. ఈ పేరు పెట్టడానికి ఓ చరిత్ర ఉందని తెలిపింది. ఇంగ్లాండ్ -ఆస్ట్రేలియాల మాక్ రాబర్ట్ సన్ ఎయిర్ రేస్ లో పాల్గొన్న బ్రిటిష్ విమానం నుంచి ఈ కారు తయారైందని అందుకే దీనికి ఆ పేరు పెట్టామని అంటున్నారు.
‘కామెంట్’ కారులో 25kWh బ్యాటరీ ప్యాక్, 50 kWతో శక్తిని మోటార్ కు అందిస్తుంది. EV రహిత కారైన దీనికి ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన తయారీదారులు అంటున్నారు. బ్యాటరీ LFP సెల్ఫ్ ను కలిగి మెరుగైన బ్యాటరీ లైఫ్ తో పాటు అత్యధిక ఫర్ఫామెన్స్ ను దీని సొంతం అని అంటున్నారు. నిర్వహణ ఖర్చు సైతం సాధారణంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఆకట్టుకునే డిజైన్ తో పాటు భవిష్యత్ తో ఉపయోగపడే EVలకు ఇది తోడ్పడుతుందని అంటున్నారు.

మార్కెట్లోకి రాగానే ఈ కారు సంచలనం సృష్టిస్తుందని యాజమాన్యం ఎంజీ మోటార్స్ పేర్కొంటుంది. దీనిని సొంతం చేసుకోవాలంటే రూ.10 లక్షల లోపే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 19న దీనిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టి ఆ తరువాత వాహన దారులకు పరిచయం చేయనున్నారు. కాగా ఎంజీ మోటార్స్ నుంచి రిలీజైన తొలి ఎలక్ట్రిక్ వాహనం జెడ్ఎస్. ఆ తరువాత ఇప్పుడు ఇదే కంపెనీ రెండో ఈవీని పరిచయం చేస్తోంది. స్మార్ట్ కంపార్ట్ కలిగిన దీంతో ఇండియన్ మార్కెట్లో సత్తా చాటుతామని ఎంజీ మోటార్స్ తెలుపుతోంది.