Chanakya Niti: ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి ఈ 5 లక్షణాలే ప్రధాన కారణం..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా మనిషి ఎదుగుదలకు అవసరమయ్యే ఎన్నో మంచి వాక్యాలను పొందుపరిచారు. ఇలా నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి విజయపథంలో నడవాలన్న ఒక మనిషి తను అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్న ఎలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి.. ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అదేవిధంగా మన ఇంట్లో ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు రావడానికి గల కారణం ఏమిటి… […]

Written By: Kusuma Aggunna, Updated On : January 9, 2022 10:42 am
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా మనిషి ఎదుగుదలకు అవసరమయ్యే ఎన్నో మంచి వాక్యాలను పొందుపరిచారు. ఇలా నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి విజయపథంలో నడవాలన్న ఒక మనిషి తను అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్న ఎలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి.. ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అదేవిధంగా మన ఇంట్లో ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు రావడానికి గల కారణం ఏమిటి… ఇంట్లో మన నడవడిక ఆధారంగా ఆర్థిక సమస్యలు వస్తాయని ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు. మరి ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం….

తులసి మొక్క ఎండిపోవడం: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. ఇలాంటి లక్ష్మీస్వరూపమైన తులసి మొక్క ఎండిపోతే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని సంకేతం.

దీపారాధన చేయకపోవడం: ఏ ఇంట్లో అయితే దీపారాధన చేయకుండా ఉంటారో ఆ ఇంటి పై ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

పెద్దవారిని అగౌరవించడం: ఏ ఇంట్లో అయితే పెద్దలను గౌరవించకుండా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించి వారిని అగౌరపరచడం జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. పెద్దలకు అవమానం జరిగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

Also Read: Chanakya Niti: ఈ ఐదు లక్షణాలు కనుక కనిపిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి?

గాజు పగిలిపోవడం: ఏ ఇంట్లో అయితే పగిలిపోయిన గాజు వస్తువులు ఉంటాయో లేదా తరచూ గాజు వస్తువులు, అద్దం పగులుతూ ఉంటాయో అలాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కూడా ఆర్థిక సమస్యలను సూచించే లక్షణం.

ఇంట్లో తరచూ గొడవలు జరగడం: మన ఇంట్లో ఎల్లప్పుడు గొడవలు జరుగుతూ ఉండటం తరచు వాగ్వాదానికి వెళ్లడం వంటివి జరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. ఈ విధమైన ఇటువంటి లక్షణాలు కనుక మనకు అనిపిస్తే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడతాయని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు.

Also Read: Chanakya Niti: అమ్మాయిలలో ఉండకూడని రెండు లక్షణాలు ఇవే.. ఇలాంటి వారితో స్నేహం కూడా ప్రమాదమే..!