Seven Generations: పూర్వకాలంలో వివాహ సంబంధాలు చూసే సమయంలో కొందరు పెద్దలు చెబుతున్న మాట ఒకటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వైపు నుంచి బంధువులు.. అబ్బాయి నుంచి బంధువులు ఏడు తరాల వరకు ఎలా ఉన్నారు? వాళ్లు ఎలా జీవించారు? వాళ్ల కట్టుబాట్లు ఎలా ఉన్నాయి? అనేది చూడాలని అంటారు. అయితే నేటి కాలంలో అలా జరగడం లేదు. ఈరోజు చూసిన అమ్మాయిని రేపు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే పెద్దలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. అసలు అటు ఇటు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని ఆనాడు పెద్దలు ఎందుకు చెప్పారు. దీనికి ఏమైనా సైంటిఫిక్ రీసన్ ఉందా? కచ్చితంగా ఉంది?
పూర్వకాలంలో పెద్దలు పెద్దగా చదువుకోలేదు. కానీ వాళ్లు కాలాన్ని.. పరిస్థితులను బట్టి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు వారు ఏర్పాటు చేసిన పద్ధతులే ఇప్పుడు సైన్స్ నుంచి వస్తున్నాయి. అప్పటి ఆహారపు అలవాట్లు.. ఆచార వ్యవహారాలు.. ప్రతి ఒక్కటి మానవ జీవన శైలికి ఉపయోగపడినవే. అయితే నేటి కాలంలో కొందరు మూఢనమ్మకాలు అంటూ వాటిని కొట్టి పారేస్తుంటారు. కానీ అందులో కూడా సైంటిఫిక్ రీసన్ ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. అటు ఏడూ తరాలు.. ఇటు ఏడు తరాలు.. అనే మాటలో కూడా సైంటిఫిక్ రీసన్ ఉంది.
కొన్ని జంతువుల్లో చేసిన పరిశోధనల ప్రకారం.. తల్లి జంతువులు ఏర్పడిన కెమికల్స్ లేదా శరీరంలోని జీన్స్ పుట్టే బిడ్డ నుంచి ఆ తర్వాత ఏడు తరాల వరకు పాస్ అవుతూనే ఉంటాయి. అలా ఏడు తరాల వరకు మనుషులు పోలిన మనుషులు ఉండడం లేదా ఒకరికి ఉన్న అలవాట్లు మరొకరికి ఉండడం వంటివి చూడొచ్చు. ఇలా కొందరు మనుషుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏడు తరాల తర్వాత మళ్లీ కొత్త జన్మతో మరో ఏడు తరాలు పాస్ అవుతూ ఉంటుంది. ఇలా ఏడు తరాల వరకు ఒక మనిషికి సంబంధించిన జీన్స్ సర్క్యూలేట్ అవుతుండడంతో.. వారి వంశానికి చెందిన వారిని కనుక్కోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు.
అందుకే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి అటు ఇటు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడమని చెప్పారు. అయితే ఇలా ఏడు తరాలపాటు తమ వంశం అభివృద్ధి చెందాలంటే జన్మనిచ్చే తల్లిదండ్రులను.. ఎదిగే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వంశాలను కాపాడేది వీరు మాత్రమే. వీరి ద్వారానే వంశం నిలబడుతుంది. కొందరు ఏదో ఒక బిడ్డకు జన్మనిచ్చామని అనుకుంటారు. కానీ ఏడు తరాలపాటు తమ వంశానికి జన్మనిస్తారు.