Motivational quotes 2025: జీవితంలో గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరూ ఉన్నత శిఖరాలను చేరుకోలేరు. కొందరు మాత్రమే అనుకునేది సాధిస్తారు. అనుకున్నది సాధించే వారిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. మీరు లైఫ్ గురించి ప్రత్యేకంగా ప్లాన్ వేస్తారు. సమయాన్ని కాపాడుకుంటారు. నిత్యం శ్రమిస్తారు. కానీ కొందరు మాత్రం కొన్ని ప్రతికూల ప్రతికూల వాతావరణాలు ఏర్పడగానే లక్ష్యం కోసం చేసే ప్రయాణాన్ని ఆపేస్తారు. ఇలా ఆపేసిన తర్వాత ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏర్పడుతుంది. అదే తర్వాత. అర్థం కావడానికి కాస్త సమయం పట్టినా.. ఈ తర్వాత అనే పదం జీవితాన్ని నాశనం చేస్తుందంటే నమ్మలేరు. అది ఎలాగంటే?
ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి కష్టపడే తత్వం ఉంటుంది. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉంటుంది. ప్రస్తుతం అతడు వ్యవసాయం చేస్తూ, గేదెలను సాదుతూ ఉన్నాడు. ఒకసారి అతని భార్య ఇలా చెప్పింది.. పంట పొలంలో నీళ్లు తగ్గిపోతున్నాయి.. వెంటనే నీళ్లు పట్టే ప్రయత్నం చేయి అని అంది.. కానీ రాము మాత్రం తర్వాత చూద్దాంలే అని అంటాడు. అలాగే మరో రోజు పొరుగువారు నీ గేదెలకు ఏదో వ్యాధి వచ్చింది.. వెంటనే టీకాలు వేయించు.. అని చెబుతారు. కానీ రాము మాత్రం సరే చూద్దాంలే అని అంటాడు.. ఇంకో రోజు ఇంటి గోడ ప్రమాదకరంగా ఉంది కూలిపోయే అవకాశం ఉంది అని భార్య చెబుతుంది.. సరే అంటాడు కానీ పట్టించుకోడు..
అయితే ఒక రోజు భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో ఇంటి గోడ కూలిపోతుంది. గేదెలకు జ్వరం వస్తుంది. పంట పొలాల్లోకి నీరు బాగా చేరి నాశనం అవుతుంది. అయితే రాము ముందు జాగ్రత్తగా గోడను మళ్లీ నిర్మించుకుంటే ఎలాంటి నష్టం ఉండేది కాదు. గేదెలకు ముందే టీకాలు వేయిస్తే అవి వ్యాధి బారిన పడేవి కాకుండా ఉండేవి. అలాగే పంట పొలంలో నీళ్లు పడితే ముందుగానే నీటిని గ్రహించి పంటపాడవకుండా ఉండేది.
ఇక్కడ రాము చేసిన ప్రధాన తప్పు తర్వాత అనే ఆలోచనతో ఉండడం. రాము మాత్రమే కాకుండా నేటి యువత చాలామంది ఈ పదానికి బాగా అలవాటు పడిపోయారు.. ఏ పని చేద్దామన్న తర్వాత అనే ఆలోచనతో ఉండడంతో.. తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ తర్వాత అనే ఆలోచన పోవడానికి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.
తర్వాత తలుపు మూసేస్తారు.. తర్వాత సమయం గడిచిపోతుంది.. తర్వాత గ్లాసులో పాలు అయిపోతాయి.. తర్వాత ట్రైన్ వెళ్లిపోతుంది.. ఈ పదాలను ఎప్పటికప్పుడు మరణం చేసుకుంటే.. మన జీవితంలో కూడా కొన్ని పనులను తర్వాత చేద్దాంలే అని అనుకోరు. అంతేకాకుండా ఎప్పటి పనిని అప్పుడే పూర్తిచేసి ఎలాంటి నష్టం రాకుండా కాపాడుకుంటారు. జీవితంలో ఎదగాలని అనుకునేవారు ఈ తర్వాత పదం ను దూరం చేస్తే తప్ప గెలవలేరు..