
Ajinkya Rehane : ఐపీఎల్ లో అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవాళీ క్రికెట్లో విశేషమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. సంప్రదాయ క్రికెట్లో తనదైన షాట్లతో అలరించాడు. అతడే అజింక్య రెహానే. చెన్నై ముంబై మ్యాచ్ లో పరుగుల దాడి చేశాడు. దీంతో చెన్నై విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో రెహానే పాత్ర ఎంతో ఉంది. సొగసరి షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు.
చెన్నై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి రెండో వికెట్ కు 82 పరుగులు రాబట్టాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సు లతో ఏకంగా 51 పరుగులు జోడించాడు. సొగసైన షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. రెహానే బౌలింగ్ చూసిన వారికి ఎంజాయ్ దక్కింది. మైదానం నలు మూలల ఫోర్లు, సిక్సులు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ఆడుకున్నాడు. పీయూష్ చావ్లా బౌలింగ్ లో వెనుదిరిగాడు.
చాలా కాలం తరువాత క్రికెట్లో పసందైన ఆటను చూశారు. రెహానే ఆటను అందరు ఆస్వాదించారు.
రెహానే బ్యాటింగ్ చూసి మురిసిపోయారు. అభిమానులు ఖుషి అయ్యారు. ఫాస్టెస్ట్ గా అర్ధ సెంచరీ చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పరుగులు వరద పారించాడు. సింహంలా గర్జించి బౌలర్ల భరతం పట్టాడు. పరుగుల వేటలో దూకుడు ప్రదర్శించాడు.
అర్షద్ ఖాన్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం జరుగుతుందో తెలియలేదంటే అంత దారుణంగా బౌలర్లను పరుగెత్తించాడు. టెస్ట్ బ్యాట్స్ మెన్ అనుకున్నారు. కానీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను ఆడుకున్నాడు. తనదైన శైలిలో రాణించి ఒంటి చేత్తో గెలిపించాడు. రహానే బ్యాటింగ్ కు అందరు ఫిదా అయ్యారు.
మంచి ఫ్లాట్ ఫాం దొరికితే రెచ్చిపోవడం బ్యాట్స్ మెన్ కు అలవాటే. ఐపీఎల్ లో జరిగిన చెన్నై ముంబై
ఇండియన్స్ మ్యాచ్ లో అతడి ఆటతీరు మురిపించింది. హెలికాప్టర్ షాట్లు కొడుతూ పండగలా ఆడుకున్నాడు. ఈ నేపథ్యంలో రెహానే బ్యాటింగ్ తో అభిమానుల కోరిక తీరినట్లయింది.