
Megastar Chiranjeevi – Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప : ది రూల్’ కోసం ఇండియా మొత్తం ఎలా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసారు.ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ ని చూసి అందరూ గొప్పగా మెచ్చుకున్నారు కానీ, ఫస్ట్ లుక్ ని చూసి మాత్రం షాక్ అయిపోయారు.
ఒక స్టార్ హీరో కి ఇంత డెడికేషన్ ఉంటుందా అని అల్లు అర్జున్ ని అభిమానించని వాళ్ళు కూడా పొగడ్తలతో ముంచి ఎత్తేలా చేసాడు అల్లు అర్జున్.అమ్మవారి గెటప్ లో చీర కట్టుకొని ఉగ్ర రూపం దాల్చిన అల్లు అర్జున్ ని చూసి టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం నోరెళ్ళ బెట్టారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ మామయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు.ఆయన నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు కి శుభాకాంక్షలు తెలియచేస్తూ,పుష్ప లుక్ చాలా స్టన్నింగ్ గా ఉంది, మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంది శభాష్ అంటూ అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేసాడు.ఈ లుక్ గురించి కామెంట్ చేసిన ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.కేవలం టీజర్ మరియు ఫస్ట్ లుక్ తోనే ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్, ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మే 3 వ తారీఖున విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.త్వరలోనే డేట్ అధికారికంగా ప్రకటించబోతున్నారట, పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని మడతపెట్టేసిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ తో ఎలాంటి రికార్డ్స్ ని సెట్ చేస్తాడో చూడాలి.