Jayalalitha : సినిమా ఇండస్ట్రీ అనేది బయటి నుంచి చూడటానికి ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. అందరూ దాన్ని రంగుల ప్రపంచం అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ మనం అనుకున్నంత రంగులు అయితే కనిపించవు. నిజానికి ఎవరి దృష్టిలో ఎలా ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇక్కడ ఎదగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అయితే టాలెంటు ఉన్నా లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా సర్వైవల్ అవ్వాలని చాలామంది చూస్తుంటారు. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. మిగిలిన వాళ్ళు అవకాశాలు రాకపోవడంతో వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇండస్ట్రీకి రావాలి అనే ఆశ ఎంతున్నా కూడా ఇక్కడ మనం నిలవగలమా లేదా అని ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉందనే చెప్పాలి… సినిమా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లి రాజకీయాలు చేస్తున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.
ఇక తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో జయలలిత హీరోయిన్ గా చాలా మంది గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆ తర్వాత కాలంలో ఆమె సీఎంగా కూడా మారింది. అయితే ఈమెకి ఇప్పటికి కూడా అక్కడ చాలా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.
ప్రస్తుతానికి ఆమె లేకపోయినా కూడా ఆమె పేరు చెబితే చాలు అందరూ అమ్మ అంటూ ఆమె గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆమె లైఫ్ లో ఒక్కసారి కూడా దీపావళి పండుగని జరుపుకోలేదట. దానికి కారణం ఏంటి అంటే ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1790 లో టిప్పు సుల్తాన్ నరక చతుర్దశి నాడు మైసూర్ లోని మేల్కోటి ఆలయానికి వెళ్లి అక్కడ 1000 మంది హిందువులను ఊచకోత కోసి 200 మంది ఆడవాళ్లను బంధించి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారట. ఇక అక్కడ ఉన్న సంపద మొత్తాన్ని తనతో పాటే తీసుకెళ్లాడట…
దాంతో అప్పటినుంచి మేల్కోటి ప్రాంతంలో దీపావళి పండుగని జరుపుకోరట. ఇక ఇప్పటివరకు కూడా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే వస్తుంది. అయితే జయలలిత కూడా మేల్కోటి ప్రాంతానికి సంబంధించిన ఆవిడే కావడం వల్ల ఆమె కూడా తను బ్రతికున్నంత కాలం దీపావళి పండుగను జరుపుకునేది కాదట. ఇక ఆమెను ఎవరైనా మీరు దీపావళి పండుగ ఎందుకు జరుపుకోరు అని అడిగితే ఈ స్టోరీ చెప్పేదట. ఇక మొత్తానికైతే జయలలిత తమిళనాడు సీఎంగా చాలా సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి…