https://oktelugu.com/

Maruti car coming in the market: 32 కిలోమీటర్ల మైలేజ్.. లేటేస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతున్న మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?

దేశంలో మారుతి కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సెడాన్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో పలు మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్న మారుతి కార్లు ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లతో లాంచ్ అవుతూ వినియోగదారలను ఆకట్టుకుంటున్నాయి. మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు దశాబ్దాలుగా విక్రయాలు జరుపుకుంటూ ఉంటున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 1, 2024 11:21 am
    Maruthi-Suzuki

    Maruthi-Suzuki

    Follow us on

    Maruti car coming in the market: దేశంలో మారుతి కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సెడాన్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో పలు మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్న మారుతి కార్లు ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లతో లాంచ్ అవుతూ వినియోగదారలను ఆకట్టుకుంటున్నాయి. మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు దశాబ్దాలుగా విక్రయాలు జరుపుకుంటూ ఉంటున్నాయి. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ప్రతినిధులు ఫీచర్లతో పాటు డిజైన్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. తాజాగా మరో కారు కూడా మార్పులు చేసుకొని మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ మోడల్ ఇప్పటికే వినియోగదారులను ఆకట్టుకుంది. అయినా లేటేస్ట్ గా నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యాయి. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    మారుతి నుంచి వచ్చిన దిగ్గజ కార్లు వ్యాగన్ ఆర్, స్విప్ట్ తరువాత మంచి సేల్స్ ను నమోదు చేసుకుంది Swift Dzire. ఈ మోడల్ సెడాన్ వేరియంట్ అయినప్పటికీ SUV రేంజ్ లో కనిపిస్తుంది. ఇంందులో Boot Space ఎక్కువగా ఉండడంతో SUV కార్లతో పోటీపడుతోంది. అయితే డిజైర్ కు మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ దీనిని కొద్ది పాటి మార్పులు చేసి మార్కెట్లోకి రీ రిలీజ్ చేయనున్నారు. అయితే ధరలో ఎటువంటి మార్పులు లేవని తెలుస్తోంది.

    మారుతి స్విప్ట్ డిజైర్ ఇంజిన్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 81 బీహెచ్ పవర్ తో 117 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 32 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఇంజిన్ తో పాటు ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల ప్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే వంటివి ఆకర్షిస్తాయి.

    Swift Dzire కారు సేప్టీ పరంగా ఆకట్టుకుంటోంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు ఎలక్ట్రికల్ పోల్డముల్, అడ్జస్టబు్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక బాక్సీ డిజైన్ కలిగిన Swift Dzire కొత్తగా ఎల్ ఈడీ ల్యాంపులు, ఎల్ ఈడీ డీఆర్ఎల్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆకర్షించడానికి సన్ రూప్ ను అమర్చారు. బయట నుంచి మెటల్ ఫినిషింగ్ విండో సిల్స్, కొత్త డ్యూయల్ టోన్, అల్లాయ్ వీల్స్ వంటికి ఆకట్టుకుంటున్నాయి.

    కొత్త డిజైర్ మార్కెట్లోకి వచ్చిన తరువాత రూ.6.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. అలాగే ఇది బ్లూ బ్లాక్, మాగ్మా గ్రే, స్ల్పెండిడ్ సిల్వర్ వంటి కలర్లలో అందుబాటులో ఉండనుంది.