Injuries: గాయాలు మనిషి జీవితంలో ఏదొక సందర్భంలో బాధ బెడుతూనే ఉంటాయి. ఇక ఎముకల బెణుకుల బాధల గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? మరి వీటి నివారణకు మార్గాలు ఏమిటి ? మీకు తెలుసా ? గోంగూర వీటి బాధను పోగొడుతుందని.

గోంగూరను కొద్దిగా ఉడికించి కడితే.. చర్మంలో దిగినటువంటి ముళ్ళు పైకి వస్తాయి. అదేవిధంగా గోంగూరను కొద్దిగా ఉడికించి దెబ్బల పైన పూసిన, పేరుకొని గడ్డ కట్టిన రక్తం పై పూసిన గోంగూర నొప్పి హరిస్తోంది.
గాయాలు అయిన వెంటనే చామగడ్డ రసం గాయం పై పూసినా, లేక దుంపను నూరి గాయంపై కట్టినా ఆ గాయం త్వరగా మానుతుంది.
Also Read: ప్రెషర్లకు విప్రో అదిరిపోయే శుభవార్త.. రూ.29,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?
చింతాకును బియ్యపు కడుగులో వేసి కాచి వేడిగా ఉన్నప్పుడు, ఆ ఆకును గుడ్డలో వేసి కాపడము పెట్టిన దెబ్బల పోటు, బాధలు పోతాయి.
ఇక గ్రుచ్చుకున్న ముల్లును తీసివేసాకా, ఆ ఏర్పడిన గాయానికి జీడిగింజను అంటించి కాపడము పెట్టినా చాలు, ఇక చీము పట్టదు. బాధ వెంటనే పోతుంది.
సున్నపు నీటిలో మంచి నూనెను కలిపి రంగరించిన నవనీతమును కోడి ఈకతో కాలిన గాయాలపై పూసినా మంటలు తగ్గి గాయపు పుండు త్వరగా మానిపోతుంది.
కాళ్ళుచేతులు మడతబడి నొప్పి చేసినా, దెబ్బలు బాధ పెట్టినా, నరాలు, బెణుకులు వాపులు వచ్చినా ఆ ప్రదేశంలో ఆవనూనెతో మర్దించి పై నుండి వేడినీటిని ఆ ప్రదేశం పై ధారగా పోయాలి. ఈ విధంగా చేస్తే తగ్గుతాయి.
Also Read: ప్రెషర్లకు విప్రో అదిరిపోయే శుభవార్త.. రూ.29,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?