selfies : ఎక్కువగా సెల్ఫీ తీసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే!

రోజుకి 14 కంటే ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఉంటూ తక్కువగా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Written By: NARESH, Updated On : September 20, 2024 9:22 pm

Taking too many selfies can put you at risk

Follow us on

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటున్నారు. బయట ఎక్కడ చూసిన ఇదే గోల. కొందరు అయితే సెల్ఫీ మీద కోరికతో వాళ్లు ప్రాణాలు కూడా విడిచి పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నారు. ఇలా ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని అనుకుంటున్నారు. ఇలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం అనేది నేటి తరానికి ఒక ఫ్యాషన్‌లా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేవరకు రోజులో ఒక్కసారైన, ఒక్క సెల్ఫీ అయిన తీసుకుంటారు. అయితే ఇలా ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు. కానీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. మరి ఆ సమస్యలేంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.

సెల్ఫీ అందంగా రావాలని అందరూ భావిస్తారు. ఫొటో మంచిగా వస్తే సోషల్ మీడియాలో పెడితే లైక్స్ వస్తాయని వివిధ రకాల స్టిల్‌లలో సెల్ఫీలు తీసుకుంటారు. దీనికోసం మోచేతులను వంచుతుంటారు. దీనివల్ల మోచేతులపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. దీంతో సెల్పీ ఎల్బో వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే సెల్ఫీ స్టిక్‌తో తీసుకున్న కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ వల్ల చేతులు ఇంకా పైకి పెడుతుంటారు. దీంతో కండరాల మీద ఎక్కువగా ఒత్తిడి పడి. మోచేతులు వాపుగా మారుతాయి. అలాగే సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అధికంగా చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే సెల్ఫీ వల్ల కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయి. సెల్ఫీ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఫొటో అప్‌లోడ్ చేస్తారు. దీంతో ఎవరో ఒకరు ఫొటో బాలేదని అనడం వంటి జరుగుతుంది. మీరు కూడా ఇతరుల ఫొటోలతో పోల్చుకుంటూ.. అందంగా లేమని ఫీల్ అవుతారు. నేను అందంగా లేనా అని ఫీల్ అయి ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. రోజుకి 14 కంటే ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఉంటూ తక్కువగా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.