women’s health : 30 ఏళ్లు దాటిన మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే!

మారిన జీవనశైలి వల్ల బయట ఫుడ్ తినిడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. దీనివల్ల హైపర్ కొలెస్టెరోలేమియా, హైపర్ కార్డియోమయోపతి వంటి సమస్యలు తగ్గుతాయి.

Written By: Vadde, Updated On : September 20, 2024 6:34 pm
Follow us on

women’s health : ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పని, ఆఫీస్‌లో పని వల్ల వాళ్ల ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వాళ్లు ఒత్తిడికి గురి అయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గుండె సమస్యలు, మధుమేహం వంటి వాటితో కూడా మహిళలు బాధపడుతున్నారు. బిజీగా ఉండటం వల్ల వాళ్ల ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. జ్వరం, ఇంకా ఏదైనా వచ్చిన కూడా ఏం కాదులే అని వదిలేస్తారు. ఇలా చిన్న సమస్యలను పెద్దగా చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రతి మహిళ కూడా తన 30 ఏళ్లలో తప్పకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు ఆమెకు ఏ సమస్య ఉందో లేదో తెలుస్తుంది. మరి మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన ఆ పరీక్షలు ఏంటో చూద్దాం.

క్యాన్సర్
ఈరోజుల్లో అయితే ఎక్కువ శాతం మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీకు ఛాతీలో ఏ మాత్రం చిన్న నొప్పి వచ్చిన కూడా వెంటనే వైద్యుని సంప్రదించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి మమోగ్రఫీ చేయించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారి అయిన కూడా టెస్ట్ చేయించుకుంటే వ్యాధి ముదరక ముందే గుర్తించవచ్చు. వీటితో పాటు కొందరు గర్భాశయ క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పాప్ సియర్ పరీక్ష చేసుకోవాలి.

కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష
సరైన ఆహారం తీసుకోక చాలామంది మహిళలు రక్తహీనత, హిమోగ్లోబిన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని గుర్తించాలంటే ప్రతి మహిళ కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష చేయించుకోవాలి. బాడీలో ఏ మాత్రం మార్పులు వచ్చిన టెస్ట్ చేసుకోవాలి.

థైరాయిడ్
ప్రస్తుతం థైరాయిడ్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. బాడీలో ఏమాత్రం కొత్త లక్షణాలు కనిపించిన, బరువు తగ్గడం, పెరగడం, పీరియడ్స్ సరిగ్గా కాకపోయిన కూడా థైరాయిడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష
మారిన జీవనశైలి వల్ల బయట ఫుడ్ తినిడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. దీనివల్ల హైపర్ కొలెస్టెరోలేమియా, హైపర్ కార్డియోమయోపతి వంటి సమస్యలు తగ్గుతాయి.

మధుమేహం
పురుషులతో పాటు మహిళలు కూడా మధుమేహం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిన తర్వాత ప్రతి మహిళ డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్షించుకోవాలి. అప్పుడు ముందుగానే వ్యాధులు రాకుండా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.