Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు జల ముఖి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులపై శనిదేవుని అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉండనున్నాయి. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల ఇంటికి వస్తారు. దీంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు.
వృషభ రాశి:
ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వెంటనే పూర్తి చేయాలి. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి:
జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చరేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
కర్కాటక రాశి:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా ఉంటారు. తండ్రితో వాదనలకు దిగుతారు. ఉపాధి కోసం చూసేవారు శుభవార్త వింటారు.
సింహారాశి:
వ్యాపారులకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కన్య రాశి:
పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తారు. కుటుంబ పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టబుడులు పెడుతారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు.
తుల రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
ఉద్యోగులు సీనియర్లతో సత్సంబంధాలు నెలకొల్పాలి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. సాయంత్రం శుభకార్యాక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి.
ధనస్సు రాశి:
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఏదైనా పరీక్షల్లో పాల్గొంటే అందులో విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభరాశి:
ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సాన్నిహిత్యం లభిస్తుంది.
మీనరాశి:
సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగులు ఆశించిన విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.